ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో గెస్ట్ లుగా అభిషేక్, ఐశ్వర్య రాయ్
ఆమధ్య కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి అతిథులుగా హాజరైన బాలీవుడ్ అందాల జంట అభిషేక్, ఐశ్వర్య ఇప్పుడు మరో సినిమా ఉత్సవానికి అటెండ్ అవడానికి ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో వున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 27) జరగనున్న ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో వీరిద్దరూ గెస్ట్ లుగా పాల్గొననున్నారు. మన దేశం నుంచి అకాడమీ ఆహ్వానాన్ని అందుకున్న అతికొద్ది మంది సెలేబ్రిటీలలో ఈ జంట కూడా వుంది.
అవార్డులను నిర్వహించే 'అకాడమీ' నుంచి ఆహ్వానం అందుకోవడాన్ని సినీ ప్రపంచం ఎంతో గౌరవంగా భావిస్తుంది. ఇప్పుడా గౌరవం వీరికి దక్కడంతో అభి తండ్రి సీనియర్ బచ్చన్ చాలా ఖుషీగా వున్నాడు. అలాగే జూ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ అమెరికెన్ యాక్టర్ వారెన్ బీట్టీ ని కలవనున్నారని అమితాబ్ తన ట్విటర్ ద్వారా తెలిపాడు. ఈ అవార్డుల వేడుకకు ఇంకా ఒక్క రోజు టైం ఉండడంతో వీళ్లిద్దరూ ఇప్పుడు షాపింగ్ లో బిజీగా ఉన్నారట!


Click it and Unblock the Notifications











