»   » ట్రైలర్‌ వచ్చేసింది: ఫన్నీగా...హిట్టయ్యేటట్లే ఉంది (వీడియో)

ట్రైలర్‌ వచ్చేసింది: ఫన్నీగా...హిట్టయ్యేటట్లే ఉంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ముందు చెప్పినట్లుగానే ...బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ నటించిన నూతన చిత్రం 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' ట్రైలర్‌ ఈ రోజు విడుదలైంది. ఈ ట్రైలర్ ఫన్నీగా ఉంది. హిట్టయ్యేటట్లే ఉందని అంటున్నారు. మీరు ఈ ట్రైలర్ ని చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఓ మైగాడ్ చిత్రం ఫేమ్...ఉమేశ్‌ శుక్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌, అసిన్‌, రిషి కపూర్‌, సుప్రియా పథక్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

ఇందులో సోనాక్షి సిన్హా మరో ముఖ్య పాత్రలో ప్రేక్షకులని అలరించనుంది. ఆగస్టు21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు ముందు ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని అభిషేక్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు.

Abhishek Bachchan All Is Well trailer released

మొదట ఈ చిత్రాన్ని మొదట జులై 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అనివార్యకారణాల వల్ల ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత అభిషేక్‌ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం ఇది.

ఇందులో అభిషేక్‌ తల్లి పాత్రకు స్మృతీ ఇరానీని నటిస్తుందని ప్రచారం జరిగింది. అనంతరం ఆ పాత్ర కోసం సుప్రియా పతక్‌ని తీసుకున్నారు.

అభిషేక్ మరో చిత్రం గురించి...

Abhishek Bachchan

త్వరలో మరో క్రికెటర్ జీవితంపై కూడా సినిమా రాబోతోంది. అతను మరెవరో కాదు....ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. 2013లో వచ్చిన యువరాజ్ సింగ్ ఆటో బయోగ్రఫీ ‘టెస్ట్ ఆఫ్ మై లైఫ్' ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో యువరాజ్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇండియన్ క్రికెట్ టీంలో స్థానం సంపాదించుకుని స్టార్ క్రికెటర్ గా ఎదిగిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. క్యాన్సర్‌ను జయించి మళ్లీ క్రికెట్లో నిలదొక్కుకున్న సంఘటనలు ఈ చిత్రంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రంపై ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

English summary
Director Umesh Shukla's All Is Well, starring Abhishek Bachchan and Asin, will hit theatres on August 21. Abhishek, 39, unveiled his first look of the movie on his Instagram account. In the poster, Abhishek is seen standing near a sign board, which reads 'All is Well', on a highway. His character poster also says, "It's all about me":
Please Wait while comments are loading...