రింగులో ఫింగర్ పెట్టలేక పోతున్న అభిషేక్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ మరోసారి షూటింగులో గాయపడ్డాడు. ఈ సారి అభి చేతి వేలు చితికి పోయి ఫ్యాక్చర్ అయింది. దీంతో రింగులో ఫింగర్ పెట్టకుండా అయింది అభి పరిస్థితి. మళ్లీ కొంతకాలం షూటింగ్ కు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం అభిషేక్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'బోల్ బచన్ బోల్" సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ అనంతంర ఆ సినిమా సాంకేతిక నిపుణులతో క్రికెట్ ఆడుతుండగా తన వైపు వేగంగా దూసుకొచ్చిన బాల్ ను క్యాచ్ పట్టే క్రమంలో చేతిని అడ్డు పెట్టిన అభిషేక్ వేలుకు గాయం చేసుకున్నాడు.
జూనియర్ బచ్చన్ తనకు అయిన గాయం గురించి ట్విట్టర్ లో పేర్కొనడంతో పాటు, అందుకు సంబంధించిన ఫోటోను కూడా పోస్టు చేశాడు. తనకు అభిమానుల సానుభూతి కావాలంటూ ఆకాంక్షించాడు. అంతే కాదు...మా నాన్న వెన్ను ముఖ గాయంతో బాధ పడుతున్నాడు. ఆయన లోన్లీగా బాధ పడటం నాకు ఇష్టం లేదు. నా వేలి గాయంతో ఆయకు కంపెనీ ఇస్తునాను అంటూ చమత్కించాడు. ఈ నెలలో అభిషేక్ గాయ పడటం ఇది రెండో సారి. ఇది వరకు సినిమాకు సంబంధించి ఓ స్టంట్ సీన్ లో నటిస్తుండగా గాయపడ్డ అభికి కుడి కన్ను పై భాగంలో ఆరు కుట్లు పడ్డాయి.


Click it and Unblock the Notifications











