అమీర్ ఐడియా: అద్దె ఇంట్లోకి ఐశ్వర్య-అభిషేక్
ముంబై: బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లు అద్దె ఇంట్లోకి వెళ్లబోతున్నారు. అలా అని వీరు అమితాబ్-జయా బచ్చన్లతో విడిగా ఉండాలని నిర్ణయించుకున్నారని మాత్రం భావించొద్దు. అసలు విషయం ఏమిటంటే. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ 'దూమ్ 3' చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ యూఎస్‌లోని చికాగోలో జరుగుతోంది.
సినిమా షూటింగులో భాగంగా అభిషేక్ కొన్ని నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీంతో ఇన్ని రోజులు భార్య పిల్లలను విడిచి ఉండలేని అభిషేక్ తన భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్యల కోసం చికాగోలోని ఓ అపార్ట్ మెంట్‌లో ఇల్లు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అమితాబ్, జయాజీ కూడా అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వెలుతుంటారట.
అభిషేక్ బచ్చన్‌కి ఈ ఐడియా రావడానికి కారణం ధూమ్ 3 చిత్రం మెయిన్ హీరో అమీర్ ఖానే. అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్, తనయుడు ఆజాద్ రావ్ ఖాన్ కోసం చికాగోలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. నిర్మాతలు లగ్జరీ హోటల్‌లో అకామిడేషన్ ఆఫర్ చేసినా ఇంటి వాతావరణంలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే అద్దెకు దిగాడు. అమీర్ ఐడియానే అభిషేక్ కూడా ఫాలో అవుతూ....ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.
ధూమ్ 3 చిత్రానికి విజయకృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ బేనర్‌పై ఆదిత్య చోప్రా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా ముఖ్య తారాగణం. ప్రీతమ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











