»   » నాగ్ ప్రియురాలితో డాన్స్ పేరుతో పబ్లిగ్గా ముద్దులతో రొమాన్స్ చేసిన స్టార్ హీరో

నాగ్ ప్రియురాలితో డాన్స్ పేరుతో పబ్లిగ్గా ముద్దులతో రొమాన్స్ చేసిన స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ నటీమణి షబానా ఆజ్మీ ఇటీవల తన 60వ జన్మదినోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించుకున్నారు. షబానా పాత స్నేహితులు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రిషీ కపూర్, స్నేహీతురాళ్లు రేఖ, జయాబచ్చన్ వంటి వారితో పాటు, ఆమెను అమితంగా అభిమానించే విద్యాబాలన్, ఊర్మిళ తదితరులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరో, మన్మథుడు నాగార్జున ప్రియురాలు, బాలీవుడ్ లో పేరొందిన టబు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. తన భార్య ఐశ్వర్య రాయ్ ను వెంటబెట్టుకుని అభిషేక్ కూడా ఈ వేడుకకు విచ్చేశాడు. పాత సంగతులన్నీ ముచ్చటించుకుంటూ నవ్వుతూ తుళ్లుతూ పార్టీ మహా రంజుగా సాగిపోతా ఉంది. షబానా నటించిన సినిమాల్లోని హిట్ గీతాలు వీనులకు విందు చేస్తున్నాయి.

ఇంతలో సడన్ గా అభిషేక్ బచ్చన్ లేచినిల్చుని పాటకు అనుగుణంగా తన పాటకు అనుగుణంగా తన పాదాలు కదపడం మొదలుపెట్టాడు. అంతేనా..టబు కూర్చున్న చోటుకు వెళ్లి ఉన్న పళంగా ఆమెను రెండు చెతుల్తో నిల్చొబెట్టి..ఆమెను తనతో డాన్స్ చేయమని అభ్యర్థించాడు. మిగతా వారంతా దానికి వంతు పాడారు. మొదట కొంచె విస్తుబోయిన టబు, వెంటనే తేరుకుని అభితోపాటు నాట్యం చేసి..ఆ పార్టీ లో డాన్స్ ప్రోగ్రామ్ ఏర్సాటు చేయని లోటును తీర్చేసిందట.

విషయమేమిటంటే..ఆ పార్టీకి ఎంటరైన దగ్గర్నుంచీ అభిషేక్ బచ్చన్ తన ఒళ్లంతా కళ్లు చేసుకుని టబు అందాల్ని ఆరగిస్తూనే ఉన్నాట్ట. టబుకు ఎదురెళ్లి ఆమెను గాఢంగా కౌగిలించుకుని ఒకటికి రెండు సార్లు ముద్దులాడిన తర్వాత కూడా ..తనను తాను నిగ్రహించుకోలేక..డాన్స్ పేరుతో టబుతో పబ్లిగ్గా రొమాన్స్ చేసాడని పార్టీకి వచ్చినవాళ్లలో పలువురు వ్యాఖ్యానించారంట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu