చిన్నపిల్లపై ఇదేంటి? ఐశ్వర్యరాయ్ కూతురును టార్గెట్ చేస్తూ ట్వీట్.... అభిషేక్ కౌంటర్!
Recommended Video

ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య తరచూ తన తల్లితో కలిసి వివిధ కార్యక్రమాలు, వేడుకల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మంగుళూరులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అమ్మతో కలిసి ఆరాధ్య సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆరాధ్య లుక్ చూసి అభిమానులు పాప చాలా క్యూట్‌గా, అందంగా ఉందని ప్రశంసలు గుప్పిస్తుంటే... ఓ మహిళ ఆరాధ్య గురించి ఎవరూ ఊహించని ట్వీట్ చేసింది. దీనికి అభిషేక్ బచ్చన్ తగిన సమాధానం ఇచ్చారు.

అసలు ఏం ట్వీట్ చేసింది?
ఆరాధ్య తరచూ తన తల్లి ఐశ్వర్యతో కలిసి కనిపిస్తుండటం, తన తండ్రితో తక్కువగా కనిపించడం, స్కూలు విషయాలు ప్రస్తావిస్తూ సదరు మహిళ ట్విట్టర్ ద్వారా అభిషేక్‌ను ప్రశ్నించింది.

మీ పాప స్కూలుకు వెళ్లడం లేదా?
‘మీ కుమార్తె స్కూలుకు వెళ్లడం లేదా? తల్లితో విహారయాత్రలకు వెళ్లాలి అనుకున్న ప్రతిసారి పాఠశాల యాజమాన్యం ఎలా సెలవులు ఇచ్చేస్తోంది..... లేక మీరు మీ అమ్మాయి అందంగా ఉంటే చాలు చదువు అక్కర్లేదని అనుకుంటున్నారా?' అంటూ సదరు మహిళ అభిషేక్ బచ్చన్‌ను ప్రశ్నించింది.

సాధారణ బాల్యం గడపటం లేదు
ఆరాధ్య సాధారణ బాల్యాన్ని గడపకుండా.. ఎప్పుడూ అహంకారపూరితమైన తన తల్లి చేయి పట్టుకుని తిరుగుతుంటుంది' అంటూ సదరు మహిళ చేసిన ట్వీటకు అభిషేక్ బచ్చన్ తగిన సమాధానం ఇచ్చారు.

తగిన సమాధానం ఇచ్చిన అభిషేక్
‘మేడం.. నాకు తెలిసి దాదాపు అన్ని పాఠశాలలకు వీకెండ్ సెలవులు ఇస్తారు. నా కూతురు వారంలోని మిగిలిన రోజుల్లో పాఠశాలకు వెళ్తోంది. మావైపు నుంచి తప్పులేదు. మీ ట్వీట్‌లో ఏదో తప్పు ఉంది' అంటూ అభిషేక్ కౌంటర్ ఇచ్చారు.

ఆరాధ్య విషయంలో ప్రొటెక్టివ్ గా ఉంటా
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ మాట్లాడుతూ...ఒక తండ్రిగా నా కూతురు విషయంలో ప్రొటెక్టివ్ గా ఉంటాను. నా కూతురు గురించి ఏదైనా ప్రశ్న అడిగితే దానికి తప్పకుండా సమాధానం ఇస్తాను అని అభిషేక్ బచ్చన్ తెలిపారు. ఆరాధ్యను జాగ్రత్తగా చూసుకోవడం తండ్రిగా నా బాధ్యత. ఈ ప్రపంచంలో ఏ తండ్రి అయినా కూతురు విషయంలో ఇలాగే ఉంటాడు అని అభిషేక్ తెలిపారు.

మంగుళూరులో పెళ్లికి హాజరైన ఐశ్వర్య, ఆరాధ్య
ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఇటీవల మంగుళూరులో జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు అభిమానలు ట్విట్టర్లో షేర్ చేశారు.

ఐశ్వర్యరాయ్ సినిమాలు
ఐశ్వర్యరాయ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమో అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ లతో కలిసి ఫన్నే ఖాన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ గ్లామరస్ గా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











