హిందీ బిజినెస్ మ్యాన్ రీమేక్ ఖరారు..ఆ హీరోతో
మహేష్ బాబు రీసెంట్ సూపర్ హిట్ బిజినెస్ మ్యాన్ ఫైనల్ గా హిందీలోకి వెళ్లటానికి ఫిక్స్ అయ్యింది. హిందీ వెర్షన్ లో చేయటానికి గానూ అభిషేక్ బచ్చన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసి తెలిపారు. ఆ ట్వీట్ లో...ఫైనల్ గా ప్రాజెక్టు ఖరారైంది. నేను,పూరీ జగన్నాధ్ కలిసి ఇద్దరం కలిసి తెలుగులో సూపర్ హిట్ అయిన బిజినెస్ మ్యాన్ రీమేక్ చేయనున్నాం. అందులో అభిషేక్ బచ్చన్ చేస్తున్నారు అని ట్వీట్ చేసారు.
ఇక అంతకుముందు పూరీ జగన్నాధ్ ..బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ...రీసెంట్ గా అభిషేక్ రీసెంట్ ట్రాక్ రికార్డు చూస్తే... ఆయన్ని బిజినెస్ మ్యాన్ రీమేక్ కు తీసుకోవటం అవసరం అని అర్దమైంది. ఆయలో ఈ పాత్ర డిమాండ్ చేసినంత ఫైర్ లేదు. అందుకే మహేష్ బాబునే హిందీ రీమేక్ కు కూడా తీసుకుందామనుకుంటున్నాను అన్నారు. అయితే మహేష్ హిందీని అంత ప్లూయింట్ గా మాట్లాడకపోయినప్పటికీ ఆయనే బెస్ట్ ఛాయిస్ అన్నారు. ఆయన పాపులారిటిని పెంచటానికి హిందీ మాట్లాడక పోవటం అనేదిచ అస్సలు అడ్డంకి కాదు అన్నారు. అయితే మహేష్ కి ఈ చిత్రం హిందీలో చేయటం ఆసక్తి లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











