పూరీ జగన్నాధ్ కి బాలీవుడ్ లో మరో సూపర్ ఆఫర్
వరస చూస్తూంటే బాలీవుడ్ లో పూరి జగన్నాధ్ సెటిల్ అయిపోయేటట్లు కనపడుతున్నారు. ఆయన అమితాబ్ తో రూపొందిస్తున్న 'బుడ్డా హోగా తేరా బాప్' చిత్రం విడుదల కాకముందే అమితాబ్ తనయుడు అబిషేక్ బచ్చన్ తో ఓ చిత్రం కమిటయ్యారు. 'బుడ్డా హోగా..' షూటింగ్ టైమ్ లోనే పూరి డైరక్షన్ శైలి అభికి ఎంతగానో నచ్చి ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక తమ నిర్మాణ సంస్థ ఏబీ కార్పొరేషన్‌పైనే పూరీని సినిమా చేయమని కోరినట్లు తెలిసింది.
ఈ విషయమై అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ ''పూరి మంచి దర్శకుడు. ఆయన నాకు వినిపించిన కథ చాలా బాగుంది. 'పోకిరి' సినిమాను చూశాను. ఎంతగానో నచ్చింది. ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక చిత్రానికి పని చేయాలని నిర్ణయించుకొన్నాం''అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అభిషేక్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.ఇక 'బుడ్డా హోగా తేరా బాప్' సినిమా వచ్చే నెల మొదటి వారంలో విడుదలవుతుంది.


Click it and Unblock the Notifications











