తల్లి చెత్త సినిమా అంటున్నా...అభిషేక్ బచ్చన్ అదేదారి!
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్స్ షారుఖ్‌ఖాన్, దీపిక పదుకోన్, అభిషేక్ బచ్చన్, బోమన్ ఇరానీ తదితరులు నటించిన ‘హ్యాపీ న్యూఇయర్' బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైన 300 కోట్ల క్లబ్‌లో చేరింది.
తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీయాలని అభిప్రాయ పడుతున్నారు ఆ చిత్ర స్టార్స్. దీనిపై అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ...‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రానికి సీక్వెల్ తీయాలని అంతా కోరుకుంటున్నాం. ఈ సినిమా మర్చిపోలేని జ్ఞాపకం. సినిమా షూటింగ్ సమయంలో అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం' అని తెలిపారు.

కాగా...గత కొన్ని రోజుల క్రితం ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంపై జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పనికిమాలిన సినిమాగా ఆమె పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తాను చూసిన పనికిమాలిన సినిమా ఇదేననీ, కేవలం తన కొడుకు అభిషేక్ నటించినందునే ఆ సినిమాని తాను చూశాననీ ఆమె ఆ సినిమాను ఎండగట్టారు.
ఇదివరకు సినిమా అంటే కాస్త కళాదృష్టి కూడా ఉండేదనీ, ఇప్పుడు దాన్ని కేవలం వ్యాపారంగానే భావిస్తుండటం వల్లే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని చురకలంటించారు. స్వయంగా జయా బచ్చన్ ఈ కామెంట్స్ చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. తన తల్లి ఈ సినిమాను ఈసడించుకుంటున్నా...తనయుడు అభిషేక్ బచ్చన్ మాత్రం సినిమాకు సీక్వెల్ రావాలని కోరుకుంటుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











