హిందీ ‘ఈగ’లో అభిషేక్ వార్తపై రాజమౌళి క్లారిటీ
హిందీ 'ఈగ' చిత్రాన్ని బాలీవుడ్ స్టార్లతో తీయాలనే ఆలోచనలో ఉన్నారని, ఇందుకోసం అభిషేక్ బచ్చన్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సుదీప్, సమంత పాత్రలను యదావిధిగా డబ్బింగ్ చేసి, తక్కువ నిడివిగల నాని పాత్ర స్థానంలో అభిషేక్‌తో రీషూట్ చేసి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఆ వార్తల సారాంశం.
ఈ వార్తలపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ...అవన్నీ కేవలం రూమర్లే అని కొట్టిపారు. హిందీ 'ఈగ'లో అభిషేక్ నటిస్తున్నాడనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈగ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నామని, ఈగ చిత్రంపై వస్తున్న రూమర్లను నమ్మ వద్దని స్పష్టం చేశారు.
ఈగ చిత్రాన్ని హిందీలో 'మక్కి' పేరుతో విడుదల చేస్తున్నారు. 3డి టెక్నాలజీతో ఈ చిత్రాన్ని హిందీలోకి కన్వెర్షన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించడంతో హిందీలోనూ కాసుల వర్షం కురిపిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'ఈగ' చిత్రం గ్రాఫికల్ వండర్ చిత్రంగా పేరు తెచ్చుకుని తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని నలుదిశలా చాటింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో జులై 6న విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి, కెమెరా : సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











