పూరీ జగన్ కి అభిషేక్ బచ్చన్ ట్విస్టు
అభిషేక్ బచ్చన్ తో పూరీ జగన్నాధ్..ది బిజెనెస్ మ్యాన్ సినిమాని చేయటానికి కమిటైన సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి అమితాబ్ తో పూరీ చేసిన బుడ్డా చిత్రం ఊహించిన మేరకు హిట్ కాకపోవటం అభిషేక్ ని ఆలోచనలో పడేసిందని సమాచారం. అందులోనూ తెలుగులో వరస ప్లాప్ లు కూడా ఆయన దృష్టికి వచ్చి మరోసారి ఆలోచనలో పడేసాయంటున్నారు ముంబై సినీ జనం. దాంతో మహేష్ తో మొదట ది బిజెనెస్ మ్యాన్ సినిమాని పూరీ పూర్తి చేసి రిలీజ్ చేసాక..దాని రిజల్ట్ చూసి అప్పుడు పూరీ కి డేట్స్ ఇద్దామనే నిర్ణయానకి వచ్చినట్లు చెప్తున్నారు.అందుకునే పూరి వెంటనే ఇడియట్ సీక్వెల్ ని ప్రకటించాడని వినికిడి.


Click it and Unblock the Notifications











