ఐష్‌ను అసభ్యంగా ఫోటోలు తీశాడన్న అనుమానంతో... అభిషేక్ అతన్ని పిలిచాడు..
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీకి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఆమె భర్త్ అభిషేక్ బచ్చన్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీకి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఆమె భర్త్ అభిషేక్ బచ్చన్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీలో ఐష్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలించింది.

ఫోటోగ్రాఫర్‌లు క్లిక్కులు కొట్టేశారు
అయితే పార్టీ అనంతరం ఇంటికి వెళ్లడానికి అభిషేక్ తన కారును మల్హోత్రా ఇంటి బయటకు తీసుకొచ్చి ఐష్ కోసం ఆపాడు. ఐష్‌కు తోడుగా మల్హోత్రా కారు వరకు వచ్చాడు. ఐష్ కనిపించగానే అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్‌లు క్లిక్కుల మీద క్లిక్కులు కొట్టేశారు.

సైగలతో రమ్మని పిలిచాడు
అయితే ఐష్ కారులో కూర్చునే సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్ పొట్టిగా ఉండటంతో ఏమైనా అసభ్యంగా కనిపించే అవకాశం ఉందని గ్రహించిన అభిషేక్ ఓ ఫోటోగ్రాఫర్‌ను సైగలతో రమ్మని పిలిచాడు. దగ్గరకి పిలిచి ఫోటోలు చూపించమని అడిగాడు.

అసభ్యంగా లేకపోవడంతో
ఫోటోలేవి అసభ్యంగా లేకపోవడంతో అభిషేక్, ఐష్ లు ఇంటికి వెళ్ళి పోయారు. అయితే ప్రస్తుతం ఈ తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఐష్ ప్రస్తుతం ఫన్నే ఖాన్ అనే సినిమాలో నటిస్తుంది.

హౌస్ ఫుల్ 3 చిత్రంలో
అనీల్ కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధా పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఐష్, రాజ్ కుమార్ ప్రేమికులుగా కనిపించనున్నారు. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇక హౌస్ ఫుల్ 3 చిత్రంలో చివరిగా కనిపించిన అభిషేక్ .. సంజయ్ లీలా భన్సాలీ తదుపరి మూవీ కోసం రెడీ అవుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











