»   » దిల్ రాజు ఆధిపత్యానికి అడ్డు పడుతున్నాడు, ఎవరు?

దిల్ రాజు ఆధిపత్యానికి అడ్డు పడుతున్నాడు, ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూవీ డిస్ట్రిబ్యూటర్లలో నైజాం ఏరియాలో దిల్ రాజుదే పైచేయి. ఇక్కడ ఇంకా కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నప్పటికీ దిల్ రాజుతో పోటీ పడేంత మాత్రం కాదు. అయితే చాలా కాలం తర్వాత నైజాం ఏరియాలో దిల్ రాజు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే డిస్ట్రిబ్యూటర్ వచ్చాడని ఫిల్మ్ నగర్లో చర్చసాగుతోంది.

డిస్ట్రిబ్యూషన్ రంగంలోకొ కొత్తగా ఎంటరైన అతని పేరు అభిషేక్. అభిషేక్ పిక్చర్స్ సంస్థ పేరుతో సినీ డిస్ట్రిబ్యూషన్ నడుపుతున్న అతడు ఇటీవల కాలంలో దిల్ రాజుతో పోటీ పడుతూ సినిమాలను కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇటీవల కొన్ని సందర్భాల్లో దిల్ రాజు అతనికంటే వెనకబడి పోయాడు.

Dil Raju

ఆ మధ్య విడుదలైన మహేష్ బాబు ‘శ్రీమంతుడు' చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకునేందుకు దిల్ రాజుతో పాటు, అభిషేక్ పోటీ పడ్డారు. చివరకు దిల్ రాజుకంటే ఎక్కువ చెల్లించి రూ. 14.5 కోట్లు సొంతం చేసుకున్నాడు అభిషేక్. ఈ సినిమా ద్వారా రూ. 5 కోట్ల వరకు లాభం పొందినట్లు సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో' విషయంలో కూడా అభిషేక్ పిక్చర్స్ పైచేయి సాధించింది. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ తో కలిసి ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకుంది. ఈ సినిమా విషయంలో కూడా దిల్ రాజు ప్రయత్నించి విఫలం అయ్యాడని టాక్.

English summary
Dil Raju has got a strong competition and this is in the form of a new person. He is a young man named Abhishek and he has begun taking pictures under his banner Abhishek Pictures. Reports say Abhishek bought ‘Srimanthudu’ Nizam rights for a whopping 14.5 crores.
Please Wait while comments are loading...