బాడీ షేప్ కోసం 'ది బిజినెస్ మెన్' వాయిదా
ది బిజినెస్ మ్యాన్ లో హీరో ఓ గ్యాంగస్టర్. అతను క్రైమ్ ని కూడా ఆర్గనైజ్డ్ కంపెనీ తరహాలో నడుపుతూంటాడు. అలా నడిపే వ్యక్తి బాడీ షేప్ ఎలా ఉండాలి.ఫిజిక్ ఎలా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే హిందీ వెర్షన్ కి చేస్తున్న అభిషేక్ బచ్చన్ మూడు నెలలు బ్రేక్ తీసుకున్నాడు. దాంతో వచ్చే సంవత్సరమే ఆ వెర్షన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. తెలుగులో మహేష్ కి ఆ సమస్య లేదంటున్నారు. మహేష్ ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ కరెక్టుగా సూట్ అవుతుందని చెప్తున్నారు. ఇక ఈ విషయమై పూరీ జగన్నాద్ మీడియావారు అడిగితే.. మేము తెలుగు వెర్షన్ ది బిజినెస్ మ్యాన్ ని సెప్టెంబర్ లో మొదలెడుతున్నాము. సినిమా మొత్తం ముంబైలో షూటింగ్ జరుగుతుంది. హిందీ వెర్షన్ మాత్రం వచ్చే సంవత్సరమే మొదలవుతుంది. అయితే అభిషేక్ ప్లాన్స్ ఏమిటనేవి నాకు తెలియదు అని తేల్చేసారు. ఇక తెలుగు వెర్షన్ కి కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. హిందీకి వేరే హీరోయిన్ కోసం సెర్చింగ్ జరుగుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











