దర్శకురాలికి అభిషేక్ బచ్చన్ బెదిరింపులు!
ముంబై: సినిమా తారలు వేసే ప్రాక్టికల్ జోక్స్ అప్పుడప్పుడూ సెట్లో సీరియస్ నెస్ క్రియేట్ చేస్తుంటాయి. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ సెట్లో ఇలాంటివి చేయడంలో దిట్ట. వారు నిజంగానే వాదులాడుకుంటున్నారా? అని సెట్లో వారంతా బిత్తరపోయేలా ప్రవర్తించే వారు. అఫ్ కోర్స్...ఇదంతా సరదా కోసమే అనుకోండి.
తాజాగా బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేసే వారి లిస్టులో చేరిపోయాడు. ప్రస్తుతం ఫరా ఖాన్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో నటిస్తున్న అభిషేక్ బచ్చన్ షూటింగ్ క్యాన్సిల్ చేయండి వెళ్లి పోతాను అంటూ ట్విట్టర్ ద్వారా బెదిరింపులకు దిగాడు. అయితే ఇదంతా జస్ట్ జోకింగ్ మాత్రమే.

చింపిరి జుట్టేసుకుని చూడ్డానికి అసహ్యంగా ఉన్న దర్శకురాలు ఫరాఖాన్ ఫోటో ఒకటి తన ట్విట్టర్లో పోస్టు చేసిన అభిషేక్.... 'పాకప్ చెప్పండి. నేను ఇంటికి వెళ్లి పోతాను. మీరు ఇలాంటి అవతారం వేసుకుని ఉంటే షూటింగులో పాల్గొనడం నా వల్ల కాదు' అంటూ అభిషేక్ ట్విట్ చేసారు. ఫరా ఖాన్ కూడా అభిషేక్ ట్వీట్‌కు స్పందించి వాదనకు దిగడం....ఆసక్తికరంగా మారింది.
ఇక సినిమా విశేషాల్లోకి వెళితే...ప్రస్తుతం 'హ్యాపీ న్యూ ఇయర్' షూటింగ్ ముంబైలోని మహబూబ్ స్టూడియోలో జరుగుతోంది. ఫరా ఖాన్ సినిమాలు కామెడీ, రొమాన్స్, రిలేషన్ షిప్ లాంటి ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ప్లాన్ చేసారు.


Click it and Unblock the Notifications











