హృతిక్ తో రోమాంటిక్ సీన్స్: ఐశ్వర్యకు అబిషేక్ బచ్చన్ వార్నింగ్
గుజారిష్ సినిమా బాలీవుడ్ దంపతులు ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ల మధ్య విభేదాలు సృష్టించినట్లు సమాచారం. గుజారిష్ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ఐష్ నటించింది. హృతిక్ తో ఐశ్వర్యా రాయ్ చేసిన రోమాంటిక్ సీన్స్ అభిషేక్ ను తీవ్ర కలవరానికి గురి చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతను కుతకుత ఉడికిపోతున్నాడట. సినిమాల్లో రోమాంటిక్ సీన్లలో నటించవద్దని అభిషేక్ ఐశ్వర్యకు వార్నింగ్ ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అంతేకాకుండా, గుజారిష్ ఆడియో విడుదల కార్యక్రమంలో ఐష్ హృతిక్ తో రాసుకు పూసుకు తిరిగిందని, దీంతో అభిషేక్ మనసు తీవ్రంగా గాయపడిందని అంటున్నారు. అయితే, ఐష్ మాత్రం అభిషేక్ గట్టిగానే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాల్లో నటించిన తర్వాత ఆ మాత్రం నటించడం తప్పదని ఆమె తెగేసి చెప్పిందట. కాగా, హృతిక్, ఐష్ ల జంట సినిమాల్లో రోమాంటిక్ సీన్స్ పండిస్తుందనేది సర్వత్రా వినిపించే మాట. సినిమా ఈ జంట హాట్ ఫేవరెట్ కూడా. గతంలో ఓ సినిమాలో వారిద్దరు కిస్ సీన్ ను అద్భుతంగా పండించారు. అయితే, ఆ సినిమా నుంచి అమితాబ్ పట్టు పట్టి తొలగింపజేసినట్లు వార్తలు వచ్చాయి. జోథా అక్బర్ సినిమాలో కూడా వారిద్దరి రోమాంటిక్ సీన్స్ అద్భుతంగా పండాయి.


Click it and Unblock the Notifications











