ఆమెను 'యూజ్ అండ్ త్రో'
బాలీవుడ్ లోకి అనామకుడుగా ప్రవేశించిన అభిషేక్ అవస్తీకి సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా నిలదొక్కుకునేందుకు తనకున్న పరిచయాలన్నిటినీ ఉపయోగించానని, వాటిని వాడుకుని నన్ను మోసం చేసాడు అంటోంది సెక్స్ బాంబ్ రాఖీ సావంత్. అతని కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డాను అని చెప్తోంది. అభిషేక్ అవస్ధీ కొద్ది నెలల క్రిందటి దాకా ఆమెకు బోయ్ ప్రెండ్. అయితే అనుకోని గొడవలతో వారిద్దరూ బ్రేక్-అప్ అయ్యారు. ఆ విషయం మీడియాతో చెపుతూ తన పిరచయాలతో బాలీవుడ్ లో ఇమేజ్ సంపాదించుకున్న అభిషేక్ మాత్రం తనను వదిలేసి శ్రధ్దాశర్మ అనే యువతితో డేటింగ్ ప్రారంభించాడని వాపోయింది. అయితే ఇందుకు కారణం తన తల్లితో పాటు అభిషేక్ తల్లి, వారి పనిమనిషి కారణమని చెప్పుకొచ్చింది. అందుకే నాలుగేళ్ళ పాటు కొనసాగిన తన ప్రేమాయణం పెళ్లి దాకా వెళ్ళకుండా ముగిసిందని చెప్పుకొచ్చింది. ఇవన్నీ చూసే తనని ఇష్టపడే వారిని పెళ్ళాడాలని స్వయంవరం ఏర్పాటు చేసుకున్నానని వివరించింది.


Click it and Unblock the Notifications











