బిగ్‌బాస్ మీ ఇంటికి మహానాయకుడిని అయ్యా.. అభిజిత్ ఎమోషనల్.. చిరంజీవి చిలిపిగా ఏమన్నారంటే!
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ విజేతగా అభిజిత్ దుడ్డాల నిలిచారు. రన్నరప్‌గా అఖిల్ సార్థక్, మూడోస్థానంలో సోహెల్ సయ్యద్ ర్యాన్, అరియానా గ్లోరి, హారిక ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. ట్రోఫిని అందుకొన్న తర్వాత అభిజిత్ మాట్లాడటానికి సిద్ధం కాగానే నాగార్జున జోక్యం కలిగించుకొంటూ.. నీ పేరులోనే జీత్ ఉంది.. నీదే గెలుపు అంటూ అన్నారు. అనంతరం అభిజిత్ మాట్లాడుతూ..

చిరంజీవి, నాగ్ సార్ మధ్యన నిలబడటం
బిగ్‌బాస్ వేదిక మీద మాట్లాడాలంటే కొంత ఆందోళనగా ఉంది. టాలీవుడ్‌కు పిల్లర్ లాంటి చిరంజీవి, కింగ్ నాగార్జున సార్ మధ్య మాట్లాడాలంటే కంగారుగా ఉంది. ఇలాంటి గొప్ప లెజెండ్స్ మధ్య నిలుచుంటాను. బిగ్‌బాస్ తెలుగు 4కు విజేతగా నిలుస్తాను. వారితో ట్రోఫి అందుకొంటాననని కలలో కూడా ఊహించలేదు అంటూ అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు.

11 సార్లు నామినేట్ అయితే ప్రేక్షకులు సేవ్ చేశారు
నా బిగ్‌బాస్ ప్రయాణంలో 11 సార్లు నామినేట్ అయ్యాను. నామినేట్ అయిన ప్రతీసారి ప్రేక్షకులను నన్ను సేవ్ చేశారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు. నా మదిలో ఒకటే ఉంది. మీకు తలవంచి పాదాభివందనం చేస్తున్నాను అంటూ భూమికి తల పెట్టి వందనం అభిజిత్ చేశాడు.

అఖిల్‌లో చేతిలో ట్రోఫి పెట్టి
బిగ్‌బాస్ వేదికపై ప్రేక్షకులకు పాదాభివందనం చేసే సమయంలో తన చేతిలోని ట్రోఫిని కిందపెట్టబోతుండగా అఖిల్ ముందుకు వచ్చాడు. దాంతో అఖిల్ చేతిలో బిగ్‌బాస్ ట్రోఫి పెట్టి ప్రేక్షకులకు అభిజిత్ ధన్యవాదాలు తెలియజేశాడు. వేదిక మీద ఉన్నంత సేపు అభిజిత్ ఎమోషనల్‌గా కనిపించాడు.

ఆచార్య దేవోభవ అంటూ చిరంజీవిని చూసి
బిగ్‌బాస్ మీ ఇంటికి మహా నాయకుడిని అయ్యాను అంటూ అభిజిత్ కామెంట్ చేశాడు. ఆ తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ ఎమోషనల్ అయ్యాడు. దాంతో ఆచార్య దేవోభవ అంటూ చిరంజీవి, నాగార్జున వైపు చూశాడు.

నా సినిమా టైటిల్ ఆచార్యనా?
ఆచార్యదేవోభవ అని అభిజిత్ అనగానే.. చిరంజీవి జోక్యం చేసుకొంటూ మా సినిమా టైటిల్ ఆచార్యనా అంటూ సరదాగా పంచ్ విసిరాడు. ఈ వేదికపై నా ఆచార్య సినిమా ప్రమోషన్ కూడా జరిగింది. థ్యాంక్స్ అంటూ చిరంజీవి హుషారుగా కనిపించాడు. అలా చిరంజీవి, అభిజిత్, నాగార్జున వేదికపై ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.

బిగ్‌బాస్‌లో పార్ట్ కావడం గర్వంగా
బిగ్‌బాస్ మీరు చూపించిన ప్రోమోలో మీరు ఇంటిలో ఉండటం గర్వంగా ఉందని చెప్పారు. కానీ మీ షోలో పార్టిసిపేట్ చేయడం నాకు గర్వంగా ఉంది. మీ ప్రయాణంలో నాకు ఓ పాత్రను ఇవ్వడం నిజంగా నా అదృష్టం. ఈ అవకాశాన్ని కల్పించిన స్టార్ మా, ఎండెమాల్ షైన్ ఇండియా ఛానెల్స్‌ను రుణపడి ఉంటాను అని అభిజిత్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Recommended Video

చిరు, నాగ్‌తో ఫైనల్ సెల్ఫీ
బిగ్‌బాస్ ముగింపు కార్యక్రమంలో విజేత అభిజిత్, రన్నరప్ అఖిల్ సార్థక్‌తో కలిసి హోస్ట్ నాగార్జున, చీఫ్ గెస్ట్ చిరంజీవి, ఎండెమాల్ షైన్ ఇండియా చీఫ్ అలోక్ జైన్ సెల్ఫీ దిగారు. అనంతరం బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ ముగిసిందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు.


Click it and Unblock the Notifications











