సంక్రాంతి పోటీ ఈ ముగ్గరు మధ్యనే
ఈ సారి సంక్రాంతిని తెలుగు సినిమా ప్రియులు యాక్షన్ సంక్రాంతికి గా జరుపుకోనున్నారు. దానికి కారణం సంక్రాంతికి విడుదల అయ్యే మూడు పెద్ద చిత్రాలు యాక్షన్ సినిమాలు కావటమే. అన్నింటికన్నా ముందుగా మహేష్‌బాబు నటించిన 'ది బిజినెస్‌మేన్' రానుంది. పూరీజగన్నాధ్ ఈ చిత్రాన్ని తనకు, మహేష్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన ప్రోమోలు,ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంతటా క్రేజ్ సంపాదించాయి. ఈ చిత్రంలో డైలాగ్స్ ఎక్కడ విన్నా అవే వినపడుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పోకిరి వంటి హిట్ రావటంతో ఈ సినిమా అదే రేంజ్ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇక వెంకటేష్ విషయానికి వస్తే.. చాలా కాలం గ్యాప్ తీసుకుని యాక్షన్,సెంటిమెంట్ కలగలిపిన సినిమా బాడీగార్డ్ తో 2012లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే 'బాడీగార్డ్' పాటలు హిట్టయి ఇప్పటికే మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం మళయాళంలో సూపర్ హిట్టైన బాడీగార్డ్ కు రీమేక్ కావటంతో ఈ చిత్రంపై అన్ని వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని గతంలో డాన్ శీను వంటి హిట్ చిత్రం అందించి ఉన్నారు. కామిడీ,సెంటిమెంట్ మిక్స్ చేసిన ఈ బాడీగార్డ్ సంక్రాంతికి విజేతగా నిలుస్తుందని బావిస్తున్నారు. ఇక మూడో చిత్రం రవితేజ తాజా చిత్రం నిప్పు. ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ అందించిన గుణశేఖర్ దర్శకత్వంలో మరో ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. రవితేజ, దర్శకుడు గుణశేఖర్‌ల కలయికలో వైవిఎస్ చౌదరి నిర్మించిన 'నిప్పు' కూడా సంక్రాంతి బరిలో నిలవనుంది. 2012 మాత్రం విడుదలయ్యే సినిమాలు మూడూ కూడా మాస్ కథాంశంతో యాక్షన్ ధమకా మోగించనున్నాయి. పండుగకు వస్తున్న ఈ మూడు యాక్షన్ ధమాకా చిత్రాలు ఎంతవరకూ బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొడతాయో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











