'సింహా'కి బడ్జెట్ వేసుకోకుండానే తీశాం
'సింహా'కి బడ్జెట్ వేసుకోకుండానే తీశాం. ఇప్పుడు 'నా ఇష్టం'కు కూడా మేం బడ్జెట్ వేసుకోలేదు. ప్రస్తుతం వెంకటేశ్‌తో చేస్తున్న 'షాడో'కీ అంతే. హీరోకి 'ఇంత మార్కెట్ ఉంది' అని కచ్చితంగా చెప్పలేం. ఓ పెద్ద హీరో సినిమా ఒకటి నలభై, ఏభై కోట్లు వసూలు చేస్తే, ఆ తర్వాత సినిమా ఇరవై కోట్లే వసూలు చేస్తుంది. నేను 'హీరో మార్కెట్' అనేదాన్ని నమ్మను. స్క్రిప్టుని నమ్మితే, దానికి ఎంత అవసరమో అంతా పెట్టాలనుకుంటా అన్నారు నిర్మాత పరుచూరి ప్రసాద్.
ఆయన తాజా నా ఇష్టం చిత్రం విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...స్క్రిప్టుని బట్టే బడ్జెట్ ఇదివరకటి సినిమాలకంటే ఈ సినిమాకి మేం పడ్డ కష్టం ఎక్కువ. ఈ సినిమా ప్రిపరేషన్ నుంచి పూర్తయ్యేదాకా 22 నెలల సమయం పట్టింది. దర్శకుడు కొత్తవాడైనా ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకుండా కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాం. సమ్మెలు రావడం వల్ల షెడ్యూళ్లకు ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా 103 పని దినాల్లో సినిమాని పూర్తి చేయగలిగాం అన్నారు.


Click it and Unblock the Notifications











