నాకు దూరంగా వెళ్లకంటూ బాలకృష్ణ చెప్పారు
'ప్రయోగాత్మక గీతాలు ఇవ్వు. నీ శైలి మర్చిపోకు. అలాగని నాకు దూరంగా వెళ్లకు' అని బాలకృష్ణ చెప్పారు. ఆ మాటే మంత్రంగా పని చేశా అంటున్నారు సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్. ఆయన తాజాగా స్వరాలు సమకూర్చిన అధినాయకుడు చిత్రం పాటలు గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే బాలకృష్ణ చిత్రంలో మాస్ బాణీలకే పెద్దపీట వేస్తారు. ఆయన చిత్రాలకి నేను వెళ్లినా అలాంటి పాటల్నే ఆశిస్తాను. కాబట్టి హుషారు గీతాలు ఉండాల్సిందే. ఇక ముందు కథకు అనుగుణమైన పాటలివ్వాలి. ఆ తరవాత దర్శకుడి అభిరుచి, అభిమానుల ఆలోచనలు పట్టించుకోవాలి అన్నారు. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...షూటింగ్ మొత్తం పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బాలకృష్ణ అభిమానలుకు మాత్రమే కాక అందరికీ నచ్చే చిత్రం ఇది అన్నారు. అలాగే... కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ...నాయకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే మా చిత్రం అంటున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్‌చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు పాటలు సహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











