హాట్ టాపిక్: బాలకృష్ణ స్టేట్ మెంట్
ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ ఏమిటా అంటే బాలకృష్ణ స్టేట్ మెంటే. ఆయన చిరంజీవితోనైనా పోటీకి సై అనటం తో ఇండస్ట్రీలో చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఈ విషయమై చర్చలు చేస్తున్నారు. గతంలోనూ చాలా సార్లు బాలకృష్ణ పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చినా.. ఆయన స్వయంగా ఎప్పుడూ ప్రకటించలేదు. ఇప్పుడేమో. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని స్వయంగా ప్రకటించడమే కాకుండా.. విస్తృతంగా పర్యటనలూ చేస్తున్నారు. ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తున్నారు. దాంతో బాలకృష్ణ క్రియాశీలంగా వ్యవహరించడంతో నందమూరి కుటుంబమంతా పార్టీకి మద్దతుగా నిలుస్తోందని అంతా భావిస్తున్నారు. ఎన్టీఆర్ వారసుడిగా సినీ రంగంలో ఉండి, కుటుంబంలోనూ కీలక పాత్రలో ఉన్న బాలకృష్ణ పార్టీ తరఫున క్రియాశీలం కావడంతో ఇప్పుడు ఆయన అభిమానులు సైతం ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఈ నేపధ్యంలో ఆయన తాజా చిత్రం అధినాయకుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ చిత్రం కూడా ప్రస్తుత రాజకీయాలను ప్రశ్నిస్తూ సాగుతుందని చెప్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఏ పొలిటికల్ పార్టీని టార్గెట్ చేస్తోంది అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే ఈ చిత్రం గురించి చెపుతూ దర్శకుడు పరుచూరి మురళి..ఎక్కడో ఎవరో నిర్ణయాలు తీసుకోవాలి. అవి ఆచరణలోకి రావాలి. ఆ తరవాతే జనం సమస్యలు తీరాలి... ఈ విధానానికి తిలోదకాలు ఇవ్వాలన్నది ఆ పెద్దాయన సిద్ధాంతం. సమస్య మనదే అయినప్పుడు, దాన్ని పరిష్కరించుకొనే అధికారం కూడా మనదే కావాలంటాడు. ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే ఆయన ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? తన సిద్ధాంతాలతో ప్రజల్ని ఎలా చైతన్యం చేశాడన్నది తెర మీదే చూడమంటున్నారు. ఇది విన్నవారికి బాలకృష్ణ ఏ పార్టీని లక్ష్యంగా పెట్టుకుని చిత్రం రూపొందించారనేది స్పష్టంగా అర్దం అవుతుందని చెప్తున్నారు.
ఇక 'అధినాయకుడు'లో నందమూరి బాలకృష్ణ మూడు పాత్రల్లో కనిపిస్తారు. లక్ష్మీరాయ్, సలోనీ హీరోయిన్స్ . మహాశివరాత్రికి చిత్రాన్ని విడుదల చేస్తారు. నిర్మాత ఎమ్.ఎల్.పద్మకుమార్ చౌదరి మాట్లాడుతూ ''రాజకీయం, కుటుంబ అనుబంధాలు కలగలిసిన కథ ఇది. బాలకృష్ణ నటనే ఈ చిత్రానికి ప్రధాన బలం. మూడు తరాల్ని ప్రతిబింబించే పాత్రల్ని ఆయన సమర్థంగా పోషించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు నడుస్తున్నాయి. త్వరలో పాటల్ని విడుదల చేస్తామ''న్నారు. సంగీతం: కల్యాణిమాలిక్.


Click it and Unblock the Notifications











