'బిజినెస్ మ్యాన్'పై ఓ వింతైన నిజం
మహేష్ బిజినెస్ మ్యాన్ చిత్రంపై ఓ విచిత్ర వార్త అభిమానులలో ఆసక్తి రేపుతోంది. అది ఈ చిత్రంలోని పాటలన్నీ చాలా చిన్నవని, అన్నీ కలిపితే ఇరవై నిముషాలు కూడా లేనివని.. సాధారణంగా పాటలు 5 నిముషాలు.. లేదా నాలుగు నిముషాల చిల్లరతో ఉంటాయి. అలా కాకుండా బిజినెస్ మ్యాన్ పాటలు నిడివి తక్కువగా ఉన్నాయి. వివరాల్లో..
1. ముంబై ముంబై(రెండు నిముషాల 43 సెకండ్లు)
2. చందమామ(3 నిముషాల 4సెకండ్స్)
3. సర్ ..వస్తారో వస్తారా(3 నిముషాల 57 సెకండ్స్)
4. గోవా..గోవా(3 నిముషాల 4సెకండ్స్
5. బ్యాడ్ బోయ్స్ (3 నిముషాల 53 సెకండ్స్)
6. బిజినెస్ మ్యాన్ ధీమ్ (2 నిముషాల 49 సెకండ్స్)
మొత్తం పాటల నిడివి...19 నిముషాల 25 సెకండ్లు
అంటే మొత్తం ఇరవై నిముషాలు కూడా లేవు. అంటే స్క్రీన్ టైమ్ చాలా కలిసి వచ్చి..కథనం చాలా స్పీడుగా పరుగెత్తే అవకాశం ఉంది. ఇది మహేష్ అబిమానులకు ఆనందం కలిగించే విషయం. అలాగే ప్రత్యేకమైన కామెడీ ట్రాక్ లు కూడా లేవని, కేవలం కథ చుట్టూ తిరిగుతూ యాక్షన్ ఓరియెంటెడ్ గా సినిమా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు. గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించిన ఈ చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











