క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా చిత్రం... పూర్తి డిటేల్స్

బెయిలుపై ఇటీవల విడుదలైన శ్రీశాంత్ ఇప్పుడు హీరో అయ్యాడు. అడపాదడపా నటులతో, ఇతర క్రీడాకారులతో సరదాగా స్టెప్పులేసిన ఇతను వెండితెరపై బౌలింగ్ చేసేందుకు కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నాడీ కేరళ కుర్రాడు. తాజాగా రెండు భాషల్లో తీసే ఓ సినిమాలో శ్రీశాంత్ ప్రధానపాత్ర పోషించనున్నాడు.
పి.బాలచంద్ర కుమార్ దర్శకత్వం వహించే బిగ్ పిక్చర్‌లో ఈయన నటిస్తున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇదే సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రభుదేవా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇంగ్లండ్, దుబాయ్, చెన్నై, కొచ్చిలలో ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో షూటింగ్ ప్రారంభం కానుంది.
మలయాళం, తమిళ భాషల్లో తీసే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీశాంత్ అంకిత భావంతో పనిచేసే వ్యక్తి అని, ఫిక్సింగ్ వివాదం తన సినిమాపై ప్రభావం చూపబోదని బాలచంద్ర కుమార్ అన్నారు. శ్రీశాంత్‌కు నటనపై ఆసక్తి ఉండటంతో సినిమాల్లో చేసేందుకు నృత్యం నేర్చుకున్నాడు.
మరో ప్రక్క మఝవిల్లినట్టం వారే పేరుతో ప్రముఖ మలయాళీ కవి, సంగీతదర్శకుడు కైతప్రం దామోదరన్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు ఇది తొలి చిత్రం. ఈ చిత్రంలో శ్రీశాంత్ నటించిన దృశ్యాలను తొలగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. వ్యక్తిగతంగా తాను శ్రీశాంత్‌కు వ్యతిరేకిని కానని, మన దేశంలో అత్యుత్తమ ఫాస్ బౌలర్ శ్రీశాంత్ అని, తనకు మంచి మిత్రుడని, ప్రతికూల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశాంత్ నటించిన దృశ్యాలను తొలగిస్తున్నామని దామోదరన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











