కొట్టి పోలీసులకు అప్పచెప్పిన పవన్ హీరోయిన్

By Srikanya

పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ లో చేసిన కృతి కర్భందా గుర్తుండే ఉంటుంది. ఆమె రీసెంట్ గా టీజ్ చెయ్యబోయిన ఓ వ్యక్తిని ధైర్యంగా అడ్డుకుని పోలీసులకు అప్పచెప్పిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..ఆమె బెంగుళూరులో ఉండగా..ఆమెను కార్లోకి తోసి ఓ వ్యక్తి ఆమెను టీజ్ చేయబోయాడు. అయితే ఆమె వెంటనే ఎలర్టై అతన్ని కాలరు పట్టుకుని లాగి కొట్టింది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...ఇలా ఓ అమ్మాయిని టీజ్ చేయటం మంచి పద్దతి కాదు..నేను ఇలాంటిపనులు కన్సిడర్ చెయ్యను...అందుకే నేను అంత సీరియస్ అయ్యాను అంది. ఇక ప్రస్తుతం ఆమె మిస్టర్ నోకియా చిత్రంలో చేస్తోంది.

మంచు మనోజ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని డిఎస్ రావు నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని గతంలో కళ్యాణ్ రామ్ తో అసాధ్యుడు చిత్రం రూపొందించిన డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. మొన్నీ మధ్యనే ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X