twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఈ రోజుల్లో’కలెక్షన్ అన్ని కోట్లా?

    By Srikanya
    |

    Ee Rojullo
    ఇది చిన్న సినిమాల్లో పెద్ద విజయం. పదికోట్లు వసూలు చేస్తుందని ప్రస్తుతం ట్రేడ్ అంచనా. ఈ సినిమాకు పనిచేసిన వారే కాదు, ఈ సినిమాను పంపిణీ చేసిన వారు కూడా కొత్తవారే. అందరికీ ఈ చిత్రం ఆనందాన్ని పంచింది అంటున్నారు 'ఈ రోజుల్లో'నిర్మాతల్లో ఒకరైన జి.శ్రీనివాస రావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇలా స్పందించారు. అలాగే ...2011 మార్చిలో సినిమాను స్టార్ట్ చేశాం. మా దగ్గర డబ్బు ఉన్నప్పుడే షూటింగ్ పెట్టుకున్నాం. షూటింగ్ పెట్టుకున్న ఏ రోజూ ప్రొడక్షన్ కాస్ట్ 22 వేలుకు దాటలేదు. ఒక్క ఎమ్మెస్ నారాయణగారి సీన్స్ చేసినప్పుడు మాత్రం ప్రొడక్షన్ కాస్ట్ 80 వేలు అయ్యింది. 5డీ కెమెరాతో ఈ సినిమా తీశాం. 'దొంగల బండి' షూటింగ్ టైమ్‌లోనే ఆ కెమెరాతో ఒక నెల రోజులు పాటు ట్రయల్ షూట్ చేశాం. మాకు సంతృప్తి అనిపించిన తర్వాతే చిత్రీకరణ మొదలుపెట్టాం అన్నారు.

    అలాగే పాత్రకు, కథకు సరిగ్గా సరిపోయింది కాబట్టే రేష్మాను కథానాయికగా ఎంచుకున్నాం. ఆ తర్వాత అందరూ ఆ అమ్మాయిని త్రిషతో పోల్చారు. అది సినిమాకు హెల్ప్ అయ్యింది. ఈ రోజు తక్కువ బడ్జెట్‌లో పెద్ద విజయాన్ని సాధించారని పరిశ్రమ పెద్దలు అంటుంటే సంతోషంగా ఉంది. ఈ వారంలోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని, ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్నామని, కేవలం తెలుగువారితోనే పనిచేయడం శ్రేయా మీడియా ధ్యేయమని శ్రీనివాసరావు చెప్పారు. వారం క్రిందట ఉగాది రోజు విడుదలైన 'ఈ రోజుల్లో'చిత్రం మొదటి రోజు నుంచి కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తోంది. అతి చిన్న చిత్రంగా అంతా కొత్త వారితో వచ్చిన ఈ చిత్రం ఈ రేంజి కలెక్షన్స్ వసూలు చేయటం అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తోంది. అందులోనూ దిల్ రాజు ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని మీరీ సినిమాకు మరింత కిక్ ఇచ్చారు.

    English summary
    Producer Srinivas Rao said ..he is happy with Ee Rojullo collections and it will cross 10cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X