twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కండోమ్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయంటూ...నిర్మాత

    By Srikanya
    |

    హైదరాబాద్ : "ఈ రోజుల్లో కండోమ్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయంటే వాటికి ఎంతవరకు మంచికీ, ఏ స్థాయిలో చెడుకీ వినియోగిస్తున్నారో అర్థంకాని స్థితి ఉంది. తాత్కాలిక ఆకర్షణలకు లోనై తాము ఏం చేస్తున్నారో తెలీని మత్తులో యువత జోగుతున్నారు. అలాంటి వారికి ఈ చిత్రం కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది. అందరూ మెచ్చే చిత్రమవుతుంది'' అని 'ఈ రోజుల్లో రొమాంటిక్ క్రైమ్ స్టోరి' నిర్మాత సంతోష్ తెలిపారు.

    నూతన తారలు కిరణ్‌కుమార్, లిజా జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ రోజుల్లో రొమాంటిక్ క్రైమ్ స్టోరి'. స్టార్ డ్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సంతోష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ "వీకెండ్ పార్టీల పేరుతో యువతీ యువకులు హద్దులు దాటి ప్రవర్తించడం, రేవ్ పార్టీల ముసుగులో శృంగార కార్యకలాపాలు సాగించడం వంటి అంశాలు ప్రధానంగా, నేటి తరం అభిరుచుల్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి జి.కె. నాయుడు, సాయి, రామకృష్ణ, సత్యనారాయణ, జయసూర్య బొంపెం సాంకేతిక వర్గం.

    ప్రేమ పేరుతో హద్దుల్ని చెరిపేసిన నేటి యువతరానికి కనువిప్పుగా దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'. అలాగే మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ రోజుల్లో చిత్రం అడల్ట్ కామెడీతో రూపొందింది. ఈ రెండు చిన్న చిత్రాలు భాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రప్పించాయి. దాంతో ఈ రెండు చిత్రాల టైటిల్స్ కలిపి పెడితే ఓ వర్గాన్ని ఆకర్షించవచ్చు అని ఆలోచించిచేసిన ప్రయత్నంగా ఈ చిత్రం కనపడుతోంది. ఆ రెండు చిత్రాల కలెక్షన్స్, యువతరం ఆదరించిన తీరు ఇలాంటి సినిమాలు కుప్పలు తెప్పలుగా మొదలయ్యాయి. ముఖ్యంగా 5డిలో చిత్రాలు కాస్ట్ తగ్గిపోవటం ఇలాంటి చిత్రాల ప్రారంభానికి ఉత్సాహం రప్పింస్తోంది.

    English summary
    
 'Ee Rojullo Romantic Crime Story' is the title of an upcoming movie that is focusing on love and romance of teenage students.The title reminds you of 'Ee Rojullo' and 'Oka Romantic Crime Katha' movies, which the makers might have felt that will add fuel for the promotion of this flick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X