కమల్‌హాసన్ కి చెయ్యనన్నాను:ఇళయరాజా
కమల్ హాసన్,ఇళయరాజా కాంబినేషన్ లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అయితే కమల్ హాసన్ సినిమాకి కూడా ఇళయరాజా చేయనని రిజెక్ట్ చేసారని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ...నేను కథ నచ్చకపోతే ఎలాంటి వ్యక్తి కి అయినా పాటల్విడానికి ఒప్పుకోను...అందుకు ఉదాహరణ కమల్‌హాసన్. ఒక సందర్భంలో కమల్ కథ చెప్పారు. అందులో మొత్తం వయొలెన్స్ ఉంది. నేను చేయడానికి ఏముంటుంది? చెయ్యనని అన్నాను. మళ్లీ రెండు రోజులకు కమల్ వచ్చి కథలో మార్పులు చేశామన్నారు. ఒక్కసారి కథ చెప్పిన తర్వాత మళ్లీ మార్పులేముంటాయి? అన్నాను. ఆ సినిమాకి నేను పాటలివ్వలేదు. ఇలా చాలా సినిమాలున్నాయి అన్నారు. 'ధోని' సినిమాకు పాటలను అందించిన ఇళయరాజా నగరానికి వచ్చిన సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ఈ ముచ్చటను చెప్పుకొచ్చారు. అలాగే ... నేను సంగీతం అందించిన సినిమాలన్నీ గొప్పవి కావు. కొన్ని డబ్బా సినిమాలకు కూడా పనిచేశా. నన్ను బాగా ఉపయోగించుకోగలరు... అనే నమ్మకం కలిగించిన వారితో నేను పనిచేస్తా. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ అలంకరిస్తే అందంగా ఉంటుందో తెలియాలి. సంగీతం కూడా అంతే. నేనిచ్చే స్వరాలు, సంగీతం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో ప్రకాష్‌రాజ్‌కి బాగా తెలుసు కాబట్టే ధోణి చిత్రానికి ఇచ్చాను అన్నారు.


Click it and Unblock the Notifications











