For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొత్త బంగారం 'శ్వేతా ప్రసాద్' కబుర్లు

  By Staff
  |

  Swetha Prasad
  అవును ఇప్పుడు యూత్ లో 'కొత్త బంగారులోకం' సినిమాకన్నా హాట్ టాపిక్ శ్వేతా ప్రసాద్. ఆమె పూర్తి పేరు శ్వేతా బసు ప్రసాద్. ఆమెను దిల్ రాజు తన సినిమాలో సెలక్ట్ చేసినప్పుడు చాలామంది శ్రేయాభిలాషులు వద్దని వారించారు. అయితే రాజు ఆమె గ్లామర్ లేకపోయినా...హీరోయిన్ లక్షణాలు లేకపోయినా ఏదో ఆకర్షణ ఆమెలో ఉందనీ,ఆ క్యూట్ నెస్ తన టీనేజ్ లవ్ స్టోరీకి సరిపోతుందనీ ముచ్చటపడ్డారు. ఇప్పుడదే నిజమైంది. 'ఇక్భాల్' సినిమా చూసాక స్వప్న పాత్రకు ఆమె అయితేనే కరెక్టు అని డిసైడ్ చేసుకున్నాం అంటున్నారాయన.

  తల్లి,తండ్రి
  తండ్రి ఉత్తర ప్రదేశ్,తల్లి బెంగాళ్

  మొదటి సినిమా
  పన్నెండేళ్ళకే మకిడీ చిత్రంలో ద్విపాత్రలు చేసింది. నేషనల్ అవార్డ్ కొట్టింది.

  తర్వాత
  ఇక్భాల్,మిధున్ చక్రవర్తి తో కలిసి Eknotir Golpo అనే బెంగాళ్ ఫిల్మ్ లో

  ఇప్పుడు
  మరో హిందీ సినిమా కమిటయ్యింది

  తెలుగులో
  ఇంకా ఏదీ కమిట్ కాలేదు.(అయితే దిల్ రాజు సినిమాలో చేస్తుందని బయిట వినపడ్తోంది)

  ఎలాంటి పాత్ర కావాలి
  ప్రేక్షకులు ఐడిండెటీ చేసుకుని కనెక్టయ్యే పాత్ర ఉంటేనే సంప్రదించండి

  దీపావళి ఎలా జరుపుకుంది
  కొత్త బంగారు లోకం సక్సెస్ ఈ దీపావళి స్పెషల్ గిప్ట్. ఆ రోజు సంప్రదాయకమైన వినాయిక,లక్ష్మీ పూజలు చేసాను.

  కొత్త బంగారు లోకం సినిమా అనుభవాలు
  నాకు స్క్రిప్టు మొదటే ఇవ్వలేదు. చివర నిముషం దాకా నా డైలాగులు ఇంప్రవైజ్ చేస్తూనే ఉన్నారు. అయితే నాకు మంచి మెమరీ పరవ్ ఉండంటో సమస్యలేదు.

  మొదటిరోజు స్పందన
  మా అమ్మా నాన్నతో కలసి సినిమా చూసాను. నా వాయిస్ కి మంచి స్పందన వచ్చింది. యాంకర్ ని ఇమిటేట్ చేస్తూ నేను చెప్పే ..ఇ..ప్పు..డే వంటి డైలాగులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

  అలాగే నన్ను అంతా పాట పాడమంటున్నారు
  సినిమా పాటల ఆల్బమ్ కవర్ పై పొరపాటున శ్వేతా పండిట్ (సింగర్) పేరు బదులు నా పేరు శ్వేతా ప్రసాద్ అని పడింది. దాంతో అంతా ఆ పాట పాడమంటున్నారు.మొదటి నాకు అసలు విషయం అర్ధం కాలేదు. భలే ఇబ్బంది కదా.

  ఇష్టమైన సీన్ కొత్త బంగారు లోకంలో
  వరుణ్ నన్ను..ప్రీ బర్డ్ గా ఎలా ఉండాలో చెప్పిన సీన్

  సినిమాలో నచ్చిన వారు
  బ్రహ్మానందం సార్. ఆయన చూడగానే నవ్వు వస్తుంది.

  అమ్మ గురించి
  అమ్మ చాలా స్ట్రాగ్ ఉమెన్. చాలా పాజిటివ్ థింకింగ్ తో ఉంటుంది. నేను ఆమెకు రిఫ్లేక్షన్ ని. ఆమె అంటే చాలా ఇష్టం.

  ఫ్రీ టైమ్ లో
  నమ్మినా నమ్మకపోయినా జిమ్ కి వెళ్తాను. స్విమ్మింగ్ చేస్తాను. కథక్ నృత్యం నేర్చుకుంటున్నాను.

  పార్టీలకు..పబ్ లకు
  చాలా దూరం....సినిమాలు మాత్రం వారానికి రెండు మినిమం చూస్తాను.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X