»   »  'శశిరేఖా పరిణయం'స్టోరీ గురించి..

'శశిరేఖా పరిణయం'స్టోరీ గురించి..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shashirekha Parinayam
జెనీలియా,తరుణ్ జంటగా క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశి రూపొందిస్తున్న చిత్రం శశిరేఖా పరిణయం. ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెబుతూ శశిరేఖ అనబడే అమలాపురంకు చెందిన అమ్మాయి పెళ్లి చుట్టూ తిరిగే సంప్రదాయ, సన్నివేశాల సమాహారమే ఈ చిత్రమని వెల్లడించారు.అలాగే ఈ చిత్ర ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన వినోదం ఉంటుందని ఆయన తెలిపారు.

అంతేగాక...నిన్నే పెళ్లాడుతా", మొన్నటి "మురారి" నిన్నటి "చందమామ"ల ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రాల కోవలో "శిశిరేఖా పరిణయం" ఉండబోతుంది. తెలుగు సినిమా క్లాసిక్స్‌లో మొదటిగా చెప్పుకునే మాయాబజార్ చిత్రంలోని శశిరేఖా పరిణయ ఘట్టం తనకెంతో ఇష్టమని, దాని ప్రేరణగానే ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. శశిరేఖా పరిణయ ఘట్టమే ఈ చిత్రమని, దీనికి ఇతర పోలికలేమీ ఉండవని ఆయన నొక్కి చెబుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X