మహేష్‌బాబు ఫస్ట్ కాల్షీట్ ఎవరికంటే..

By Srikanya

2011 స్టార్ హీరో ఎవరంటే తిరుగులేకుండా మహేష్ బాబే. దూకుడుతో మెగా హిట్ కొట్టిన మహేష్ సంవత్సరం ప్రారంభం రోజున ఎక్కడ గడపబోతున్నారు..ఏ షూటింగ్ లో గడపబోతున్నారు అనేది చాలా ఆసక్తికరమైన విషయం. అయితే ఆయన ఇంటిపట్టునే ఉండాలని మహేష్‌ నిర్ణయించుకొన్నారు. జనవరి 1 వేడుక గౌతమ్‌ కృష్ణ, నమ్రతల మధ్యనే జరుపుకుంటున్నారు.

అలాగే 2012లో మహేష్‌బాబు డైరీ కూడా పూర్తిగా ఫిలప్ అయ్యిపోయింది. ఆయన కంటిన్యూగా సినిమాలు ఒప్పుకొన్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో పాటు సుకుమార్‌ సినిమా కూడా ఆయన చేస్తున్నారు. ఈలోగా మరిన్ని కథలు వినిపించడానికి స్టార్ డైరక్టర్స్ రెడీగా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి ఆయన ది బిజినెస్ మ్యాన్ చిత్రంతో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకున్నారు. పూరీ జగన్నాధ్ దర్సకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైనర్.

ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ ..సూర్య అనే పాత్రను చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పాటలు విడుదలై మంచి విజయం సాధించాయి. అలాగే పస్ట్ లుక్, ట్రైలర్స్ కూడా ఈ చిత్రంపై మంచి క్రేజ్ ను కలగచేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X