హాలీవుడ్ నిపుణులతో మోహన్‌బాబు'రావణ'
మోహన్‌బాబు మరోసారి కెమెరా ముందు బిజీ కాబోతున్నారు. 'రావణ' అనే పౌరాణిక చిత్రంలో నటించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే ఈ చిత్రం స్టోరీ డిస్కషన్స్ ఇప్పటికే ముగిశాయి. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేయబోతున్నారు. హాలీవుడ్‌కి చెందిన సాంకేతిక నిపుణులతో చర్చలు నడుస్తున్నాయి. అలాగే మోహన్‌బాబు స్వీయనిర్మాణంలో త్వరలో తెరకెక్కనున్న ఓ చిత్రంలోనూ ఆయనే నటిస్తారు. ఈ చిత్రం గురించి దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ''ఎన్టీఆర్ తరవాత సంభాషణలు ఆ స్థాయిలో పలికే నటుడు మోహన్‌బాబు. మా ఇద్దరి కలయికలో మంచి చిత్రాలొచ్చాయి. 'రావణ' కూడా అదే స్థాయిలో ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని అన్నారు. మైధలాజికల్ ధ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం రాఘవేంద్రరావు,నాగార్జున కాంబినేషన్ లో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది.
ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా మీడియాకు తెలుపుతూ...రావణుడి ఔన్నత్యాన్ని చెప్పే సినిమా ఇది. ఇంతకుముందు ఎన్టీఆర్, ఎస్వీ రంగారావులాంటి మహా నటులు ఈ పాత్రలో కనిపించారు. వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నా శైలిలో రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తాను. భారత చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తారు. అధునాతన త్రీడీ పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని అన్నారు. ఇక ఈ రోజు మోహన్ బాబు పుట్టిన రోజు...60 వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు. ఎప్పటిలాగే తిరుపతిలోని తన శ్రీవిద్యానికేతన్ సంస్థల్లో విద్యార్థుల నడుమ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రబాబునాయుడు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, దీపావెంకట్, మునిరత్నంనాయుడు, బి.గోపాల్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు . ఆయనకు ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











