'దడ' టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
నాగచైతన్య తాజా చిత్రం 'దడ'లో టైటిల్ వెరైటీగా ఉండటంతో అందరికీ ఆసక్తి కలుగుతోంది. ఈ టైటిల్ జస్టిఫికేషన్ గురించి వినపడుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య సాహసాలు చూసి ఓ అమ్మాయి కాజల్ ప్రేమిస్తుంది. అయితే అప్పటికే ఆ అమ్మాయి ఓ సమస్యలో ఇరుక్కుని ఉంటుంది. ఆమెను రక్షించే ప్రయత్నంలో విలన్ కి సవాల్ విసురుతాడు. అలా ఆమెకు రక్షకుడుగా నిలిచి ఆమె మనస్సులో 'దడ' తొలిగిస్తాడు.ఆ తర్వాత సెకెండాఫ్ లో విలన్ కి 'దడ'పుట్టించే పనిలో ఉంటాడు.
కథ ప్రకారం విశ్వ (నాగచైతన్య) బుల్లెట్ లాంటి కుర్రాడు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తుంటాడు. అక్కడ ఓ ముఠా ఆధిపత్యం చెలాయిస్తుంటుంది. విశ్వ దాన్ని అడ్డుకొంటాడు. విశ్వ దూకుడు నచ్చి ప్రియ (కాజల్) ప్రేమిస్తుంది. విశ్వ తన చదువు పూర్తి చేసుకొని ఇండియా తిరిగి రావాలనుకొంటాడు. చివరి పదకొండు రోజుల్లో అతనికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అవేంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనేవి తెర మీదే చూడాలి.


Click it and Unblock the Notifications











