twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ‘భాయ్’గురించి దర్శకుడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున హీరోగా నటించనున్న 'భాయ్' చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్తుందని చిత్ర దర్శకుడు వీరభధ్ర చౌదరి తెలిపారు. 'అహనా పెళ్లంట','పూల రంగడు' చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న వీరభద్రమ్ ఈ చిత్రంపై పూర్తి విశ్వాసంగా ఉన్నారు. స్వీయనిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్డూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించచున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందన్నారు. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుందన్నారు. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని, కింగ్ నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని వీరభద్రం చౌదరి తెలిపారు

    నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.

    దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు.

    అలాగే నాగార్జున కూడా 'భాయ్' సబ్జెక్ట్ పట్ల చాలా సంతోషంగా వున్నారని, తన కెరీర్‌లో వైవిధ్యమైన హాస్య చిత్రం చేయబోతున్నానని ఆయన ప్రశంసించినట్లు వీరభవూదమ్ తెలిపారు. 'హాలో బ్రదర్' తరహాలో సినిమా వుంటుంది కానీ నాగార్జున ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం లేదని ఆయన అన్నారు. రిచాగంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్.

    English summary
    
 Nagarjuna's new film Bhai and the shooting of the film kick-starts from the month of December. The director has already wrapped up the script work and he informs that the lead characterization will definitely suit Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X