twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నేనింతే' సియా సంగతులు (స్పెషల్)

    By Staff
    |

    Siya
    పొడుగ్గా,అందంగా,రెచ్చగొట్టే చూపులతో 'నేనింతే' అంటూ రాబోతోంది సియా. టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా మారిన ఆమె తన పేరు గురించి కొన్ని సంగతలు చెప్పింది. జయ్ సియా రామ్ అని నార్త్ లో అంటారు కదా...అలా ఆ పదం లోంచి పుట్టిన పవిత్రమైన పేరు సియా అని అంటోంది. సియా అంటే సీతా అని క్లారిఫై ఇస్తోంది. అదేంటి జై శ్రీ రామ్ అంటారేమో కదా అని డౌట్ వద్దంటోంది.

    ఇక పేరు సంగతి ప్రక్కన పెడితే ఆమె నేనింతే చేయటానికి ముందు దాదాపు పదహారు యాడ్ ఫిల్మ్స్ చేసింది. ఆమె తల్లి తండ్రి ఇద్దరూ ధియోటర్(నాటకాలు) బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన వారే కావటం ఆమె ఫ్లస్ పాయింట్లు అంటోంది.అలాగే ఆమె సైకాలజీలో గ్యాడ్యుయోషన్ పూర్తి చేసి ఈ ఫీల్డ్ లో ప్రవేశించింది.ఇక హైదరాబాద్ ఆమెకు పిచ్చపిచ్చగా నచ్చేసిందని చెప్తోంది. ఆ రోడ్లు క్లీన్ గా ఉన్నాయని,పబ్లిక్ ప్రవర్తన చాలా పద్దతిగా ఉందని మెచ్చుకుంటోంది.

    ఇక నేనింతే యూనిట్ సభ్యులైతే ఆమె చిన్న బేబిలా జాగ్రత్తగా ట్రీట్ చేసారంటూ మురిసిపోతోంది.తనను తాను వెండితెరపై చూసుకోవటం చాలా ఏక్జైటీగా ఉంటోందని చెప్తోంది.ఇక షూటింగ్ అనుభవాల్లో పదిహేను రోజులు ముందు ప్రాక్టీస్ చేయించే కెమెరా ముందుకు తీసుకొచ్చారని దాంతో పెద్ద ఇబ్బంది కాలేదంటోంది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న ఆమె ఇక్కడ బిజీ కావాలని కోరుకుంటోంది. ఇక ఆమె పాత్ర గురించి మాట్లాడుతూ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా కనిపిస్తానని,ఫైనాన్సియల్ గా ఇబ్బందులు ఉండే పాత్ర అని అంటోంది. ఇక రవితేజ అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తూ తనని ప్రేమిస్తూంటాడని అయితే కెరీర్ ముఖ్యమనుకుని ముందుకెళ్ళే అతను పెళ్ళి చేసుకోవటానికి ముందుకురాడని అంటోంది.

    ఇక తర్వాత తను హీరోయిన్ గా,రవితేజా డైరక్టర్ గా ఎదిగిన తర్వాత వచ్చే అప్ అండ్ డౌన్స్ కూడా చాలా ఉంటాయని చెప్తోంది. సినిమా మొత్త కామికల్ వే లో నడవటం కలిసొచ్చే అంశమని చెప్తోంది.నేనింతే లో మీకు నచ్చిన సీన్ ఏమిటని అడిగితే..ఆటోలో చిత్రీకరించిన చిన్న సీన్ చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వస్తుందని చేప్తోంది. బ్యాంకాక్ లో ఇరుక్కు పోయిన దాని గురించి అడిగితే..మిలియరీ ఎయిర్ పోర్ట్ ద్వారా మేం ఆ దేశాన్ని దాటాం..అదో హారిబుల్ ఎక్సపీరియన్స్ అంటోంది. సరే ముంబయి ప్రేలుళ్ళ గురించి అంటే...కన్నీరు పెట్టుకుంటూ నిన్నే ముంబయి వెళ్ళి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ర్యాలీలో పాల్గొన్నాను అంది.బెస్టాఫ్ లక్ సియా

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X