పూరీ జగన్నాధ్ ఆ కథనే కొద్దిగా మార్చి 'నేను...నా రాక్షసి'గా
రాణా, ఇలియానా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ రూపొందించిన 'నేను... నా రాక్షసి' చిత్రం త్వరలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అప్పట్లో పూరీ తన తమ్ముడు సాయిరామ్ శంకర్ తో ప్రకటించిన 'చచ్చిపోతే' కథే అంటున్నారు.అప్పట్లో దీన్ని ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై చేద్దామనుకున్నారు. దానికి పాపం సాయిరామ్ కష్టపడి మరీ సిక్స్ పాక్ తో రెడి అయ్యాడు.అయితే అన్నగారు వరస ఫ్లాపుల్లో మునిగిపోయి ఈ కథను రాణా కి చెప్పేసి ఒప్పించేయటంతో డీలా పడిపోయాడు. ఆ తర్వాత ఇదే కథకు మూడు కోతులు అనే టైటిల్ ని, నేనే లేకపోతే అనే టైటిల్ కూడా అనుకున్నాడు. కానీ అవేమీ మెటిరియలైజ్ కాలేదు.ఆదిత్యారామ్ తో చేసిన ఏక్ నిరంజన్ సినిమా ప్లాప్ తో ఆ నిర్మాత ఇక సినిమాలు చేయనని వెనక్కి వెళ్ళిపోయారు. పూరీ తాపీగా ఈ నేనూ..నా రాక్షసి సినిమాని తీసి వదులుతున్నారు.ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ''కొత్త కథలు రావడం లేదు.. తీయడం లేదు... అని పదే పదే అంటుంటే తిక్కరేగి రాసిన కథ ఇది.


Click it and Unblock the Notifications











