నితిన్ సెల్ ఫోన్ కొట్టేసి పారిపోతుంటే...

By Srikanya

మొన్న నితిన్ తాజా చిత్రం ఇష్క్ ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఆడియో పంక్షన్ కి అభిమానులు కిక్కిరిసిపోయి వచ్చాయి. పవన్ మాట్లాడి వెళ్లిపోతున్న సమయంలో ఈ దొంగతనం సంఘటన చోటు చేసుకుంది. ఈ జన సందోహంలో నితిన్ సెల్ ఫోన్ మిస్సైంది. నితిన్ అబిమానులు పవన్ ని పూల దండలతో సన్మానిస్తూంటే ఆ హడావిడిలో ఓ దొంగ నితిన్ సెల్ ఫోన్ కొట్టేసాడు. అయితే వెంటనే ఎలర్టైన నితిన్ ఆ దొంగని పట్టుకోమని సెక్యూరిటీని ఆదేసించాడు. తన కూతురిని ఎత్తుకుని ఆ సెల్ తీసుకుని పారిపోతున్న ఆ దొంగని కాసేపటికి పట్టుకున్నారు. నితిన్ ఫ్యాన్స్ ఆవేశంతో రెచ్చిపోయి ఆ దొంగపై చెయ్య చేసుకోబోతుంటే నితిన్ వెంటనే ఆపాడు. ఆడియో పంక్షన్ కి ఇబ్బంది రాకుండా ఆ హంగామాని అక్కడితో ఆపుచేసాడు.ఈ సంఘటన ఇప్పుడు పిల్మ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చకు వస్తోంది. ఇక నితిన్ హీరోగా చేసిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X