ఆ పాటలో ‘అత్తారింటికి దారేది’ కథ ప్రతిబింబిస్తుంది
హైదరాబాద్ : 'గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలి మబ్బుకోసం... తరలింది తనకు తానే ఆకాశం..పరదేశం'...ఇది ఇటీవలే విడుదలైన 'అత్తారింటికి దారేది' ఆడియోలోని ఓ పాట మధ్యలో వచ్చే లైన్ ఇది. వీడు 'ఆరడుగుల బుల్లెట్టూ'అంటూ ఈ పాట టీజర్ ద్వారా మొదట బయిటకు వచ్చి... అదరకొట్టి...తర్వాత ఆడియో ద్వారా విడుదలై అందరి ప్రశంసలు పొందింది. ఈ పాట రాసింది శ్రీమణి అనే పాటల రచయిత.
శ్రీమణి ఈ పాట గురించి చెప్తూ..... త్రివిక్రమ్‌గారు ఇష్టంతో రాయించుకున్న పాట అది. హీరో ఇంట్రడక్షన్‌కి, కథకీ రెండిటికీ సరిపోయేలా పాట ఉండాలని చెప్పారు త్రివిక్రమ్. దాంతో ఛాలెంజింగ్‌గా ఈ పాట రాశాను. ఈ పాటలో ఓ లైనుంది. 'గగనపు వీధి వీడి వలసవెళ్లిపోయిన నీలి మబ్బుకోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం' అని. ఈ రెండులైన్లు... ఈ కథను ప్రతిబింబిస్తాయి అన్నారు.
ఈ రచయిత అసలు పేరు పాగోలు గిరీష్ అయినా.. అమ్మపేరు కలిసొచ్చేలా 'శ్రీమణి' అనే కలం పేరుతో గీత రచయితగా ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. '100 %లవ్' సినిమా ద్వారా సుకుమార్ తొలి అవకాశం ఇచ్చారు. మొదట ఓ పాట రాసే ఛాన్స్ ఇచ్చారు. తొలి పాట సుకుమార్‌కు బాగా నచ్చడంతో అదే సినిమాలో మరో రెండు పాటలు రాయించారు. 'ఓ బాలు... అహో.. బాలు', 'ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్', దటీజ్ మహాలక్ష్మి..' ఈ మూడు పాటలూ మంచి పేరు తెచ్చిపెట్టాయి.
తన కెరీరక్ గురించి చెప్తూ....'100%లవ్' తర్వాత సెగ, బాడీగార్డ్, సారొచ్చారు, జులాయి, స్వామి రారా, సుకుమారుడు లాంటి హిట్ చిత్రాలకు పాటలు రాశాను. సిద్దార్థ్ 'లవ్‌ఫెయిల్యూర్' చిత్రానికైతే నాది సింగిల్‌కార్డ్. రామ్‌చరణ్ 'ఎవడు', పవర్‌స్టార్ 'అత్తారింటికి దారేది', ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్యా', సుశాంత్ 'అడ్డా' చిత్రాలకు కూడా పాటలు రాశాను. త్వరలోనే ఆ సినిమాలు విడుదల కానున్నాయి. వీరుపోట్ల, విష్ణుల 'దూసుకెళ్తా', చైతన్య దంతులూరి 'బసంతి' చిత్రాలకు కూడా పాటలు రాశాను అన్నారు.


Click it and Unblock the Notifications












