twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' రిలీజ్ గురించి

    By Srikanya
    |

    త్వరలోనే సోని మ్యూజిక్‌ ద్వారా ఆడియోను విడుదల చేసి, జూన్‌ ద్వితీయార్ధంలో అత్యధిక ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తాం' అని 'కొమరం పులి' రిలీజ్ గురించి నిర్మాత తెలిపారు. ఖుషి వంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌ కళ్యాణ్‌, ఎస్‌.జె.సూర్య కలయికలో వస్తోన్న చిత్రం 'కొమరం పులి'. కనకరత్న మూవీస్‌ పతాకంపై శింగనమల రమేష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రం విశేషాలను దర్శక, నిర్మాతలు మీడియాకు తెలియజేసారు.

    దర్శకుడు ఎస్.జె.సూర్య మాటల్లో "ఖుషి లాంటి సంచలనాత్మక చిత్రం తర్వాత - ఎటువంటి చిత్రాన్ని ప్రేక్షకులు ఎక్స్ ‌పెక్ట్‌ చేస్తారో..సరిగ్గా అలాంటి చిత్రమే ఇది. పవన్ ‌కళ్యాణ్‌ ఇందులో ఎంతో పవర్ ‌ఫుల్ ‌గా కనిపిస్తాడు. పూర్తి కమర్షియల్‌ హంగులతో రూపొందుతున్న చిత్రమిది' అన్నారు. ఇక నిర్మాత మాట్లాడుతూ - బ్యాలెన్స్‌ షూటింగ్ ‌ను ఈ నెలాఖరుకు పూర్తిచేస్తాం. దర్శకుడు ఎస్‌.జె.సూర్య అన్ని వర్గాలకు మెచ్చే ఓ పవర్‌ ఫుల్‌ కథతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కథ విన్న సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్‌ ఎంతో ఇన్ ‌స్పైర్‌ అయ్యి అద్భుతంగా బాణీలను ఇచ్చాడు. రెహమాన్‌ ఈ చిత్రం రీ-రికార్డింగ్‌ ను లండన్‌ లో చేస్తున్నారు. సాంకేతికపరంగా తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ఈ సినిమా వుంటుంది అన్నారు.

    నికీషా పటేల్‌ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మనోజ్. వీఎంసీ హనీఫా, మాస్టర్‌ భరత్‌, అలీ, బ్రహ్మాజి, శ్రీ ధర్‌రావ్‌, జ్యోతికృష్ణ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ.. బినోద్‌. కె.ప్రధాన్‌, సమర్పణ..ఎస్‌.సత్యరామ మూర్తి, ఆర్ట్..ఆనందసాయి, పాటలు..చంద్రబోస్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియ ప్రత్యేకమైన సాంగ్ చేస్తోంది. అలాగే శింబును కూడా తమిళ వెర్షన్ నిమిత్తం ఓ ఐటం సాంగ్ చేయమని అడిగినట్లు సమాచారం. ఈ చిత్రం అనంతరం జయింత్ దర్శకత్వంలో ప్రారంభమైన లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ లో పవన్ బిజీ అవుతారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X