'పంజా'లో అదే మైనస్ అంటున్నారు

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా ఈ రోజే విడుదలైంది. ఈ చిత్రంలో దర్శకుడు విష్ణు వర్దన్ కేవలం పవన్ ఇంప్రెస్ చేయటానికే,అతన్ని స్టైలిష్ గా చూపటంలోనే తన శక్తి మొత్తం వినియోగించాడని చూసిన వాళ్లు అంటున్నారు. ప్రేక్షకులను,కథని వదిలేసి యాక్షన్ సీన్స్ నే హైలెట్ చేస్తూ చాలా స్లోగా కథనం నడిపాడని చెప్తున్నారు. అలాగే సినిమాకు ప్లస్ అవుతాడనుకున్న అలీ ఎపిసోడ్ పెద్ద గా వర్కవుట్ కాలేదని,అలాగే అతులు కులకర్ణి పాత్ర కూడా వర్కవుట్ కాలేదని అంటున్నారు. అయితే సినిమాలో హైలెట్ పవన్ కళ్యాణ్ స్టైయిల్స్,అతని పవర్ ఫుల్ నటన, బ్రహ్మానందంతో చేసే కామిడీ అని అని టాక్. తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ ఇక్కడ తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అతన్ని నుంచి ఏమి ఎక్సెపెక్ట్ చేస్తున్నారో పెద్దగా పట్టించుకోకుండా తనకు తోచిన రీతిలో కథనం నడిపాడని చెప్తున్నారు. అయితే సినిమాని పవన్ కోసమే చూడాలి..చూస్తారు కూడా..అలాంటప్పుడు ఈ అంశాలేవి సినిమాకు మైనస్ గా కనపడవు.

కథ విషయానికి వస్తే...భగవాన్(జాకీ షరాఫ్) అనే గ్యాంగస్టర్ తల్లిని,చెల్లెలను పోగొట్టుకున్న జై(పవన్ కళ్యాణ్)కి ఆశ్రయమిస్తాడు. అక్కడే జై నమ్మకంగా పనిచేస్తూ భగవాన్ గ్యాంగ్ లో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ఇక సభాపతి(పరుచూరి వెంకటేశ్వరరావు), గురు(తణికెళ్ల) అదే గ్రూప్ లో మెంబర్స్. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో భగవాన్ కొడుకు మున్నా(అడవి శేషు)అబ్రాడ్ నుంచి వస్తాడు. అతను డ్రగ్ ఎడిక్ట్, ఉమనైజర్. ఇక జై ప్రెండ్ జాహ్నవి(అంజలి లావణ్య)తనని పట్టించుకోవటం లేదని భంగపడ్డ మున్నా ఆమెను చంపేస్తాడు. దాంతో జై అతన్ని చంపేసి కలకత్తా వదిలేసి తన గర్లెప్రెండ్ సంధ్య(సారా)నేటివ్ ప్రేస్ అయిన ఆంధ్రప్రదేస్ లోని ఓ గ్రామం కి వస్తాడు. ఇప్పుడు భగవాన్ అతనిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. అక్కడనుంచి జరిగే ట్విస్ట్ లతో సెకండాఫ్ నడుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X