పవన్ లుంగీ డాన్స్ గురించి త్రివిక్రమ్...
హైదరాబాద్ : 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ లుంగీలో కనిపించినప్పటి నుంచీ తెలుగులో ఈ ట్రెండ్ మళ్లీ జోరందుకొంది. క్లాస్‌గా సాగే 'బాపుగారి బొమ్మ' పాటలో పవన్ లుంగీతో కనిపించి మాస్ స్టెప్పు వేశారు. అభిమానులను మురిపించారు. ఈ దుస్తుల్ని డిజైన్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ మీడియాతో మాట్లాడారు.
రాజేష్ మాట్లాడుతూ... ''పవన్ మాస్ గెటప్పులో కనిపించే ఒకే ఒక్క సందర్భం అది. త్రివిక్రమ్ గారు స్విర్జర్లాండ్‌లో ఉండగా ఫోన్ చేశారు. 'పవన్‌ని మాస్ గెటప్పులో చూపించాలి. ఓ డ్రెస్ డిజైన్ చేయాలి' అన్నారు. అక్కడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని దుస్తుల్ని రూపొందించా. ముదురు రంగైతే బాగా నప్పుతుంది అనిపించింది. అందుకే పసుపు చొక్కా, ఎర్ర రంగు లుంగీ వేశాం. కళ్లజోడు పెట్టుకోవడం వల్ల మరింత అందం వచ్చింది. పవన్ వేసిన స్టెప్పులు కూడా బాగా కుదిరాయి..'' అన్నారాయన.
పవన్‌కి లుంగీలో కనిపించడం కొత్త కాదు. 'తమ్ముడు'లో 'ఓ పిల్ల నీపేరు లౌలీ' పాటలోనూ పవన్ లుంగీ కట్టాడు. 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ లుంగీలో కనిపించటం అభిమానులకు పండగ అయ్యింది. స్టెప్ లకు విజిల్స్ పడ్డాయి. లుంగీ డాన్స్ ఇప్పుడు ప్రతీ హీరో కోరుకుంటున్నారు. పవన్ మరోసారి ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేసారు.
'అత్తారింటికి దారేది' చిత్రం నైజాం ఏరియాలో ఈ రోజుతో 20 కోట్ల మార్కును క్రాస్ అయింది. 'మగధీర' సినిమా తర్వాత నైజాం ఏరియాలో రూ.20 కోట్ల మార్కు దాటిన సినిమా ఇదే కావడం గమనార్హం. కలెక్షన్స్ ఇంకా స్టేబుల్‌గా ఉన్నాయని ట్రేడ్ వర్గాల టాక్. మరి సినిమా ఇక్కడ ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు రూ. 65 నుంచి 70 కోట్లు వసూలు చేసిందని అంచనా...ఒక ఏపీలోనే మొత్తం రూ. 50 కోట్ల షేర్ సాధించినట్లు చెబుతున్నారు. సినిమా జోరు చూస్తుంటే కలెక్షన్ల పరంగా నెం.1 పొజిషన్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications












