‘అత్తారింటికి దారేది’ సెట్ లో ఆ జాగ్రత్తలు
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రం ఆర్ట్ డిపార్టమెంట్ కు మంచి పేరు వచ్చింది. ఈ నేపధ్యంలో ఆర్ట్ డైరక్టర్ రవీందర్ మీడియాతో మాట్లాడుతూ... ఈ చిత్రం కుటుంబ కథలకు ఆర్ట్ డెరైక్టర్తో పనుండదనేది చాలామంది అభిప్రాయం. దాన్ని బ్రేక్ చేసింది 'అత్తారింటికి దారేది' అన్నారు.
రవీందర్ మాట్లాడుతూ.... సెట్స్ కళా దర్శకుడు నిర్మాతలతో ఎక్కువ ఖర్చు చేయిస్తారు అనేవాళ్లు కోకొల్లలు. కానీ అందులో నిజం లేదు. సరైన సమయంలో సెట్ అందుబాటులో ఉంటే నిర్మాతకు ఖర్చు తగ్గుతుంది. అందుకు 'అత్తారింటికి దారేది' సినిమానే ఓ నిదర్శనం. ఈ సినిమాకు ముందు అనుకున్న పని దినాలు 120. కానీ సెట్ అందుబాటులో ఉండటంతో 103 రోజుల్లో సినిమా పూర్తయింది. కుటుంబ కథలకు ఆర్ట్ డెరైక్టర్తో పనుండదనేది చాలామంది అభిప్రాయం. దాన్ని బ్రేక్ చేసింది 'అత్తారింటికి దారేది' అన్నారు.
అలాగే నదియా ఇంటి సెట్ నాకు చాలామంచి పేరు తెచ్చింది. ఆ ఇంటి సెట్లో కొన్ని పాతకాలపు వస్తువులను చూపించాం. సెంటిమెంట్లను గౌరవించే నదియా పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికే అలా చేశాం. 'జూలాయి' చేస్తున్నప్పుడు 40 లక్షలతో బ్యాంక్ సెట్ వేశాను. 'బ్యాంక్ సెట్కి అంత ఖర్చా' అన్నారు. 15 వేల కోట్లు దాచే బ్యాంక్ అది. దానికి 40 లక్షలు వెచ్చించడం తప్పుకాదే. త్రివిక్రమ్ ఈ విషయంలో నాకెంతో సహకరించారు.
ఇక 'మగధీర'లోని ఓ సీన్లో చరణ్ డ్రమ్ము వాయిస్తాడు. ఆ డ్రమ్ము నిజంగా తయారు చేశాం. 'మరీ ఇంత చాదస్తమా?' అని నిర్మాత వారిస్తున్నా.. వినకుండా... నాగ్పూర్ నుంచి ప్రత్యేకంగా పచ్చిచర్మాన్ని తెప్పించాం. ఆ చర్మం దారుణమైన స్మెల్ వస్తున్నా... భరిస్తూ ఆ డ్రమ్ తయారు చేశాం. చరణ్ ఆ డ్రమ్ వాయిస్తున్నప్పుడు దుమ్ము లేస్తుంటే జనాల్లో వచ్చిన వైబ్రేషన్ తెలిసిందే.
ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మాత సహకరించడం వల్లే అంత అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించగలిగాం అంటున్నారు ఆర్ట్ డైరక్టర్ రవీందర్. 'మగధీర'లో జలపాతాన్ని ఛేదించుకుంటూ గుర్రంపై ఎంటరవుతాడు రామ్ చరణ్. అది చాలామంది గ్రాఫిక్స్ అనుకుంటారు. కానీ అది గ్రాఫిక్స్ కాదు. మేం చేసిన మేజిక్. గ్రాఫిక్స్తో ఆ సన్నివేశం తీస్తే జనాలకు తేలిగ్గా అర్థమైపోతుంది. దాంతో ఆసక్తి తగ్గుతుంది. లొకేషన్లో ఆ సీన్ తీసేటప్పుడే అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు అంటూ వివరించారు.


Click it and Unblock the Notifications












