ప్రభాస్ 'రెబల్'బిజినెస్ పొజీషన్ ఏంటి?
ప్రభాస్ తాజా చిత్రం రెబెల్ మీదే ఇప్పుడు బయ్యిర్ల అందరి దృష్టీ ఉంది.దానకి కారణం ప్రభాస్ వరసగా'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్' అంటూ హిట్టు సినిమాలు తర్వాత వస్తున్న చిత్రం కావటం.అలాగే లారెన్స్ కూడా 'కాంచన'సినిమాతో తానేంటో మరో సారి ప్రూవ్ చేసుకోవటం మరో కారణం.అయితే లారెన్స్ గత చిత్రం 'డాన్'డిజాస్టర్ కావటం, 'స్టైల్'చిత్రం ఎవరకీ లాభాలు తెచ్చిపెట్టకపోవటం కూడా ఈ సినిమాపై ఎఫెక్టు పడనుంది.బయ్యిర్లు ఆచితూచి అడుగు వెయ్యాలని నిర్ణయంతో ఉన్నారు.భారీ బడ్జెట్ చిత్రాన్ని భారీగా కొన్న తర్వాత ఏమన్నా అటూ ఇటూ అయితే చాలా ఇబ్బంది కాబట్టి కొంత ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. తమన్నా, దీక్షా సేథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నది.
లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'రెబల్'. పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదడుతూరాబాద్ లో జరుగనుంది. ఈ చిత్రం స్టోరీ గురించి లారెన్స్ మాట్లాడుతూ... చరిత్రలో విప్లవాలు, గొప్ప గొప్ప పోరాటాలూ... ఎలా జరిగాయో ఒక్కసారి తిరగేయండి. మొదట ఒక్కరే మొదలెట్టారు. ఆ తరవాత జనం... అనుసరించారు. పదిమందికి మంచి చేయడానికి వ్యవస్థ మొత్తం కదిలిరావలసిన అవసరం లేదు. ఒక్కడిలో ఆలోచన మొలకెత్తితే చాలు.. అలాంటి ఆలోచన మా హీరోకి వచ్చింది. అదేంటో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు లారెన్స్.
అలాగే ''ప్రభాస్ అంటే దమ్మున్న పోరాట దృశ్యాలే గుర్తొస్తాయి. 'ఛత్రపతి' తరవాత ప్రభాస్ అలాంటి సినిమా చేయలేదు. మళ్లీ 'రెబల్'లో పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా కనిపిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన అభిమానులకు ఈ చిత్రం విందు భోజనం లాంటిదే'' అన్నారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 5 నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.మిస్టర్ పెర్ఫెక్ట్ లానే ఇందులో కూడా తన లుక్ కొత్తగా ఉంటుందని హీరో ప్రభాస్ చెప్పాడు. టైటిల్‌కు తగ్గట్టుగానే స్టైలిష్‌గా, మాస్‌గా వుంటుందీ చిత్రం. ప్రభాస్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్నిఅనుకున్న ప్రకారం షెడ్యూల్స్ పూర్తి చేయగలిగితే 'రెబల్" డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తామంటున్నారు దర్శక, నిర్మాతలు... సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్.


Click it and Unblock the Notifications











