రామ్ చరణ్,దగ్గుపాటి రానా కాంబినేషన్
శ్రీకాకుళం: ''త్వరలో చరణ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తాను. ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకూ రామ్‌చరణ్‌తో కలిసి చదువుకున్నాను . అలాగే సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను'' అని దగ్గుపాటి రానా తెలిపారు. హీరో రానా దగ్గుబాటి తన తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురం ప్రమోషన్ లో భాగంగా శ్రీకాకుళం వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు.
'లీడర్' సినిమా లాంటి కథ కోసం ఎదురుచూస్తున్నానని, అటువంటి కథ దొరికితే తప్పకుండా సినిమా చేస్తానని సినీ హీరో దుగ్గుబాటి రానా అన్నారు. కృష్ణం వందే జగద్గురుం విజయోత్సవ యాత్రలో భాగంగా బుధవారం దర్శకుడు క్రిష్‌తో కలిసి స్థానిక రామలక్ష్మణ థియేటర్‌కు వచ్చారు. తనకు కృష్ణం వందే జగద్గురుం మంచి హిట్‌నిచ్చిందని, శుక్రవారం (14న) తన పుట్టినరోజని, గత పుట్టిన రోజుకు సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, ఈ పుట్టిన రోజుకు విజయాన్ని అందించిందన్నారు.
పుట్టినరోజు కానుక ఇచ్చిన డైరెక్టర్ క్రిష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పౌరాణికం సినిమా తీద్దామని క్రిష్‌ను అడగ్గా, నాతో కృష్ణంవందే జగద్గురుంలాంటి యాక్షన్ చిత్రం తీయించారని తెలిపారు. ఇటువంటి యాక్షన్ సినిమాలు కథ దొరికితే తీస్తామన్నారు. కొత్త ప్రయోగాలు చేయడంతో సినిమాలు హిట్ అవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ రానాతో సినిమా చేయడం సంతోషంగా ఉందని, సినిమా కమర్షియల్‌గా మంచి హిట్ అయిందన్నారు. సమాజంలో కొంతమంది వ్యక్తులు దోచుకున్న సంపదకు సంబంధించిన సినిమా కాదని, వారు దోచుకుంటుంటే అది చూస్తూ వూరుకునేవారి కోసం తీసిన సినిమా అని అన్నారు. ఎవరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదన్నారు. ఒక్క బళ్లారి కథే అని, దేశంలో 2జీ, 3జీ కుంభకోణాలున్నాయని, ఎన్నో ఆరాచకాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గమ్యం, వేదం చిత్రాలు తనకు ఎంతో అనుభూతినిచ్చాయని, ఈ సినిమా కొత్త అనుభూతిని ఇచ్చిందని వివరించారు.
కృష్ణం వందే జగద్గురుం సినిమాను హిట్ చేసిన జిల్లా ప్రేక్షకులకు హీరో రానా, దర్శకుడు క్రిష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రానా సినిమాలోని 'అరులు సురులు' డైలాగ్‌ను చెప్పారు. అంతకు ముందు థియేటర్ ఆవరణలో రానా అభిమానులు రానా చేతపుట్టినరోజును కేక్‌ను కట్ చేయించారు. అనంతరం దగ్గుబాటి రానా వెంకటేష్ యువసేన లెటర్‌హెడ్‌ను ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











