తలను తన్నేవాడి కథే రామ్ చరణ్ 'ఎవడు'
రామ్ చరణ్ తేజ, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా ఉండనుంది. ఆ పాత్ర గురించి మాట్లాడుతూ...గుడిని మింగేవాడుంటే, ఆ గుడిలోని లింగాన్ని కూడా స్వాహా చేసేవాడు ఒకడుంటాడు. ఒక బంతికి ఆరు పరుగులు కొడితే, ఏడో పరుగుకీ దౌడు తీసేవాడొకడు వస్తాడు. అందుకే పెద్దవాళ్లన్నారు తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడూ ఉంటాడని. అలాంటివాడే రామ్‌చరణ్...ఆ పాత్రను ఎవడు చిత్రంలో చూడాలి అంటున్నారు.
దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ..''రామ్‌చరణ్‌ని ఓ విభిన్నశైలిలో ఆవిష్కరించే చిత్రమిది. మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కథలో ప్రతి పాత్ర కీలకమే. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అలరిస్తాయని''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చరణ్, అమీలపై పబ్ నేపథ్యంలో సాగే ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. శోభి నృత్యరీతులు సమకూర్చారు. ఈ చిత్రంలో సమంత ని లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
'జంజీర్' సినిమా షూటింగ్ బిజీలో ఉన్న చరణ్, 30వ తేదీ నుంచి 'ఎవడు' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ షెడ్యూల్ లో నుంచి సమంతా,రామ్ చరణ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే 'జగదేకవీరుడు-అతిలోక సుందరి'లోని పాపులర్ సాంగ్ 'అబ్బనీ తియ్యనీ దెబ్బ..' పాట ని ఈ చిత్రం కోసం రీమిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.
డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆ తర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.


Click it and Unblock the Notifications











