రామ్ చరణ్ ‘ఎవడు’ నేపథ్యం ఇదే
హైదరాబాద్ : రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఎవడు' . ఈ షెడ్యూల్ జూన్ 20 వరకూ సాగుతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, అమీ జాక్సన్,శృతి హాసన్ పై సీన్స్ ని చిత్రీకరిస్తారు. ఇప్పటికే చిత్ర వర్గాల్లో మంచి క్రేజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదలకానుంది. ఈ చిత్రం అభిమానులను సైతం ఓ రేంజిలో అలరించే చిత్రం అవుతుందని అంటున్నారు. ఈ చిత్రం పూర్తి స్ధాయి యాక్షన్ తో ఎంటర్టైన్మెంట్ అండర్ కరంట్ గా సాగే చిత్రం అని చెప్తున్నారు.
ఒకరి ఫీలింగ్స్‌ని మరొకరు షేర్ చేసుకుంటే? ఒకరి బాధల్ని మరొకరు బాధ్యతగా స్వీకరిస్తే? వింటానికి సింపుల్‌గా ఉన్న ఈ ప్రశ్నల వెనుక ఓ దావానలమే దాగి ఉంది. దాని ఆంతర్యమే 'ఎవడు'. ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణే ఈ సినిమా. ఆ వ్యక్తులు ఎవరు? వారు పడ్డ సంఘర్షణలేంటి? 'ఎవడు' చిత్రం నేపథ్యం ఇదే. రామ్‌చరణ్ భిన్నమైన పాత్రలో యాంగ్రీ యంగ్‌మేన్‌గా ఇందులో కనిపిస్తారు.
అల్లు అర్జున్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతిహాసన్, అమీజాక్సన్ కథానాయికలు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో శ్రావ్యమైన స్వరాలను ఈ చిత్రానికి అందించారని యూనిట్ వర్గాల సమాచారం. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల 24న సినిమాను విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.
రచ్చ, నాయక్ చిత్రాల తర్వాత రాబోతున్న రామ్‌చరణ్ సినిమా ఇది. పైడిపల్లి వంశీ ఎక్కడా రాజీ పడకుండా యజ్ఞంలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. పైగా చరణ్, అర్జున్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
రామ్‌చరణ్ మాట్లాడుతూ... ''నాలుగు సన్నివేశాల తరవాత ఓ పాట, వెంటనే పోరాట సన్నివేశం.. ఈ తరహాలో సాగే చిత్రం కాదిది. సినిమా ఎత్తుగడే కొత్తగా అనిపిస్తుంది. పోరాట ఘట్టాలు కూడా విభిన్నంగా తీర్చిదిద్దారు. బన్నీ కనిపించేది కొద్దిసేపే అయినా.. ఆ పాత్రే కథను మలుపు తిప్పుతుంది'' అన్నారు.
'ఎవడు' లో రామ్ చరణ్ సరసన శ్రుతిహాసన్, అమీజాక్సన్ హీరోయిన్స్ . అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. దిల్ రాజు నిర్మాత. సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్; సంగీతం: దేవిశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications











