రామ్ చరణ్ 'ఆరెంజ్' ట్యాగ్ లైన్ ఏంటంటే...
రామ్ చరణ్ తేజ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఆరెంజ్' చిత్రానికి ట్యాగ్ లైన్ గా 'ఓ రేంజ్ లవ్ స్టోరీ' అని పెట్టారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ ప్రేమికుడులా కనిపిస్తారు. ఇక ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 28వ తేదీ వరకూ అక్కడే రెగ్యులర్ షూట్ ఉంటుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్రెస్, హెయిర్ స్టైల్ కొత్త ఉండేటట్లు ప్లాన్ చేసారనీ, అవి యూత్ ను అమితంగా ఆకట్టుకుంటాయనీ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంజనా ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మిస్తున్నారు. మగధీర తర్వాత రెడీ అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
More from Filmibeat
ఆరెంజ్ రామ్ చరణ్ తేజ్ బొమ్మరిల్లు భాస్కర్ జెనీలియా నాగబాబు మగధీర orange ram charan teja bommarillu bhaskar genelia nagababu


Click it and Unblock the Notifications











