రామ్ చరణ్ పెళ్లి మండపం గురించి ఆర్ట్ డైరక్టర్
రామ్ చరణ్, ఉపాసనల వివాహంలో హైలెట్ గా నిలిచిన అంశాలలో మండపం ఒకటి. బ్రాస్ తో చేసిన ఈ మండపం పూర్తిగా దోమకొండ కోటని పోలి ఉండేలా డిజైన్ చేసారు. అలాగే ఓపేరా స్టైల్ లో సీటింగ్ ఎరేంజ్ మెంట్స్ చేసారు. బాల్కనీ,ఛాండ్లియర్స్ తో ప్ర్తత్యంకంగా డిజైన్ చేసారు. అలాగే క్లిష్టల్ నందిలతో కూడిన ఎంట్రన్స్ లు జైపూర్ నుంచి వచ్చిన ఆర్టిస్లులు రాత్రింబవళ్లు కష్టపడి చేసారు. ఇదంతా కూడా ప్రముఖ కళా దర్శకుడు ఆనంద సాయి నేతృత్వంలో జరిగింది.
ఈ విషయమై ఆనంద సాయి మీడియాతో మాట్లాడుతూ.. కామినేని వారు మండపాన్ని తమ పురాతమైన కోటలా తీర్చిదిద్దాలని కోరుకున్నారు. మేం ఆ డిజైన్స్ చూసే ప్లాన్ చేసుకున్నాం. ఇక ఈ మండపం నాకు చాలా చాలా స్పెషల్ ఎసైన్మెంట్. నేను పెళ్లి కొడుకు,పెళ్లి కూతురలకు ఈ వివాహం ఓ మెమిరబుల్ ఎక్సపీరియన్స్ గా ఉండిపోవాలా చేయాలనుకున్నాను అన్నారు.
ప్రముఖ కళా దర్సకుడు బి.చలం కుమారుడైన ఆనంద్ సాయి ఇప్పిటవరకూ ఏడు వందల పై చిలుకు సినిమాలకు ఆర్ట్ డైరక్టర్ గా పనిచేసారు. ఆయన పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ చిత్రంతో పరిచయమయ్యారు. రీసెంట్ గా ఖలేజా,ఆరెంజ్, శక్తి,బద్రీనాధ్, రచ్చ, దమ్ము చిత్రాలుకు చేసారు. ప్రస్తుతం రామ్ చరణ్ చిత్రం ఎవడు కు కళా దర్సకత్వం వహిస్తున్నారు.
రాంచరణ్, ఉపాసనల వివాహం ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని టెంపుల్ ట్రీ ఫాంహౌస్‌లో భారీ వివాహ వేదికపై వివాహం కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకలను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గతంలో నిశ్చితార్థం కూడా ఇక్కడే జరిగింది. రాంచరణ్, ఉపాసనల వివాహానికి ఇరువురి బంధువులతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











