twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మకి ధ్రిల్లింగ్ అదే!!

    By Staff
    |

    Agyat
    ఎప్పుడూ ఏదో ఒక సంచలనమో, కొత్తదనమో కోరుకునే వర్మ ఈసారి పట్టుదలగా 'అజ్ఞాత్' అనే హిందీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో స్పెషాలిటీ ఏమిటంటో మన తెలుగు యంగ్ హీరో నితిన్ ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషించటం. ఇక మేజర్ పార్ట్ శ్రీలంకలోని సిగిరియా అడవుల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఓ క్రైమ్ థ్రిల్లర్. ఇక స్టోరీ విషయానికి వస్తే అజ్ఞాతంగా ఉంటూ మనుషుల్ని చంపే ఓ శక్తి చుట్టూ అల్లుకొన్న కథ ఇది....ఓ సినిమా యూనిట్...షూటింగ్ కి వెళ్ళి ఓ దట్టమైన అరణ్యంలో చిక్కుకుపోతారు. అక్కడ ఒకరి తర్వాత మరొకరి హత్యలు జరుగుతూంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలియదు. అలా చంపుతున్నది జంతువా? మనిషా? ఏదైనా ప్రేతాత్మ? అన్నది సస్పెన్స్‌. ఇందులో నితిన్ అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర పోషిస్తున్నారు.

    ఈ చిత్రం గురించి వర్మ చాలా ఉద్వేగంగా చెప్తున్నారు. ఆయన మాటల్లో ..ఏదో తెలియని శక్తి..వరసగా జనాల్ని చంపేస్తూంటే...ఆ విష వలయంలో చాలా మంది చిక్కుకు పోయి ఉంటే...ఇలాంటి కాంసెప్ట్ ఉన్న ధ్రిల్లర్ సినిమాలుకు నేను వీరాభిమానని..అది రెడ్లీ స్కాట్ అధ్బుతం ఎలియన్ సినిమా కావచ్చు,జాన్ కార్పెంటర్ డైరక్ట్ చేసిన ధి ధింగ్ అయ్యిండవచ్చు. అయినా బ్లెయిర్ విచ్ ప్రాజెక్టు సినిమాని మరిచిపోగమా ...అందులో చివరివరకూ నెగిటివ్ పాత్ర ఎవరో తెలియదు. అలాంటి కథనమే నా చిత్రంలోనూ ఉంటుంది కాబట్టే నా చిత్రానికి అజ్ఞాత్ అని పేరు పెట్టాను. అజ్ఞాత్ అంటే తెలియని అని అర్ధం. ఇక ఇలాంటి థ్రిల్లర్స్ ఇతర దేశాల్లో చాలా పాపులర్. ఇక్కడ డబ్బింగ్ అయి కూడా ఆ సినిమాలు పెద్ద విజయాన్నే సాధించాయి. అయితే ఇప్పటివరకూ ఇలాంటి జెనర్ గల సినిమాని సీరియస్ గా ఇండియాలో ఎవరూ ఎటెమ్ట్ చేయలేదు. అందుకే నేను ఈ సినిమా తీస్తున్నా. ఈ సినిమాలో ఎమోషనల్ కాంప్లెక్స్ లు,ఎక్స్టీమ్ భయం చూపెట్టాలనుకుంటున్నా.

    ఇక ఈ కథలో సినిమా నేపధ్యాన్ని ఎన్నుకోవటానికి కారణం ఉంది. సాధారణంగా సినిమా వాళ్ళు కొన్ని షరతులుకు లోబడి నడిచే ఆఫీస్ లా పనిచేస్తూంటారు .అలాగే ఆ వాళ్ళ జీవనశైలి, ప్రవర్తన గమ్మత్తుగానే ఉంటుంది.అలాంటి పాత్రలే ఎంపిక చేసి ఈ సినిమాలో పెట్టాను. వాటిలో కొన్ని...తనకు తానే గొప్ప అనుకుని, తనపై తానే విపరీతమైన ఇష్టం పెంచుకున్న ఓ స్టార్ , అలాగే స్టార్ డమ్ కోసం అతనితో చనువుగా మెలిగే లీడింగ్ లేడి, స్పీల్ బర్గ్ తర్వాత నేనే అని ఫీలయ్యే దర్శకుడు, డైరక్టరే దగ్గరుండి అనవసరమైన ఖర్చుపెట్టిస్తూ..తన సినిమాని పాడుచేస్తున్నాడని ఫీలయ్యే నిర్మాత, హీరోయిన్ పై మోహం చూపే అసెస్టెంట్ డైరక్టర్,అతనితో తిరిగే స్క్రిప్టు రాసే అమ్మాయి,ప్రస్టేషన్ లో ఉన్న ఓ యాక్షన్ డైరక్టర్, మాట వినని స్పాట్ బోయ్,అలా రకరకాల క్యారెక్టర్స్ ఈ సినిమాలో చోటు చేసుకుంటాయి.

    ఇక ఈ పాత్రలపై ఎప్పుడైతే తమ మీద దాడులు ప్రారంభమయ్యాయో..వారు తమలోని అసలు స్వరూపాలను బయిటపెట్టడమే కాక,తాము ఇష్టపడే వాళ్ళని రక్షించాలని పోరాటం చేస్తూంటారు. ఇదంతా ఓ రియాల్టటీ షో లా అనిపిస్తుంది.కొంత మందిని ఓ క్లిష్టమైన సిట్యువేషన్ లో పడేసి..తర్వాతేం జరుగుతుందో చూడటమన్నమాట. అలాగే ఈ సినిమా చేయటానికి ఆయన్ను బాగా ఏక్సైట్ చేసిన అంశం హ్యూమన్ డ్రామానే అంటూ దాని గురించి చెప్పుకొచ్చారు...మరణానికి ఒకరితర్వాత మరొకరు దగ్గరవుతున్న స్ధితిలో వారు ఎలా బిహేవ్ చేస్తారు..ఎన్ని విభేధాలున్నా వారంతా ఒకటై ఎలా పోరాడతారనేది ఈ కధనంలో ఆసక్తి కరం అంటారు వర్మ తన దైన శైలిలో.

    అలాగే ప్రత్యేకంగా ఆ శ్రీలంక అడవినే లొకేషన్ గా ఎంచుకోవటానికి కారణం వర్మ వివరించారు. నేను ఎప్పుడూ సినిమా లొకేషన్ కూడా ఓ క్యారెక్టర్ గానే భావిస్తాను. సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే దాని ప్రాధాన్యత దానికుంటుంది. అందుకు ఉదాహరణలు సర్కార్ హౌస్,భూత్ అపార్ట్ మెంట్. సర్కార్(అమితాబ్) సినిమా షూట్ చేసిన ఇల్లును ఇప్పటికి అంతా సర్కార్ హౌస్ అని పిలుస్తున్నారు..చాలా సినిమాలు అక్కడే షూట్ చేస్తున్నారు.అంతకుముందు కూడా చాలా సినిమాలు అక్కడ షూటింగ్ లు చేసారు. కానీ దానికి ఇప్పుడున్నంత పేరు,డిమాండ్ రాలేదు. అంతేగాక నేను ఎమోషనల్ ఏస్పెక్ట్ ని,ఫీలింగ్ ని ఆ ఇంటిని లేదా పరిశరాలను చూడగానే మన హృదయంలో కలగాలని కోరుకుంటాను. అందుకు షాట్స్ కంపోజిషన్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్,ఎడిటింగ్ వంటివి సాయపడుతూంటాయి.

    ఇక విడుదల గురించి చెబుతూ...డిసెంబర్ లో మొదలెట్టిన ఈ సినిమా షూటింగ్ జనవరి మొదటి వారం కల్లా పార్ట్ పూర్తి చేసాను. ప్రస్తుతం స్పెషల్ గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. మే, జూన్ నెలలలో అవకాశాన్ని బట్టి రిలీజ్ చేస్తాను.వర్మ సినిమాల్లో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువ మోతాదులో ఉండే చిత్రం ఇదే కావచ్చు. శ్రీలంకలో చిత్రీకరణ ఉంటుంది. మరి వర్మకిష్టమైన ధ్రిల్లర్ ఫార్మెట్ లో ఈ చిత్రం నడుపుతున్నాడు కాబట్టి సినిమా మంచి విజయం సాధించే అవకాశం ఉందని ఆయన అభిమానులు అప్పుడే ఎదురుచూడటం ప్రారంభమైంది.ఇక నితిన్ ఉన్నాడు కాబట్టి...గ్యారింటీగా తెలుగులోనూ ఈ చిత్రం డబ్బింగ్ అయి రిలీజ్ అవుతుంది. బెస్టాఫ్ లక్ వర్మ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X