దగ్గుపాటి రాణాతో జెనీలియాతో నైట్ అవుట్స్
దగ్గుపాటి రాణా, జెనీలియా కాంబినేషన్ లో నా ఇష్టం చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాత్రింబవళ్లూ షూటింగ్ జరుపుకుంటోంది.దాదాపు రాత్రి రెండు గంటలు వరకూ కూడా షూటింగ్ జరిగాయి కంటిన్యూగా. దానికి కారణం జెనీలియా, రాణా ఇద్దరూ బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే. ఈ చిత్రం త్వరగా ముగించి వారు తమ తర్వాత చిత్రంలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ మధ్యన మలేషియాలో నలభై రోజులు షూటింగ్ చేసుకొచ్చిన ఈ చిత్రం నిజానికి అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కాకపోవటం కూడా ఓ కారణం అంటున్నారు. ఇక ఈ చిత్రం ఇద్దరు వేర్వేలు ఐడియాలజీలు ఉన్న వ్యక్తుల మధ్యన జరిగే లవ్ స్టోరీ అని చెప్తున్నారు. సుకుమార్ శిష్యుడైన దర్శకుడు తోలేటి ప్రకాష్ తొలి చిత్రం ఇది. ఈ చిత్రం ఆర్య రేంజిలో వర్కవుట్ అవుతుందని నిర్మాత సైతం తన సన్నిహితులతో చెప్తున్నారని తెలుస్తోంది.
వరస పరాజయాల్లో ఉన్న బాలకృష్ణకు 'సింహా' వంటి సూపర్ హిట్ చిత్రాన్నిఅందించిన యునైటెడ్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నా తాజా చిత్రం 'నా ఇష్టం'. దగ్గుబాటి రాణా, జెనీలియా జంటగా నటిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మాత. ప్రకాష్ తోలేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరిగాయి. మూడవ షెఢ్యూల్ బుధవారం నుండి హైదరాబాద్‌లో జరగుతుంది. 'నవంబర్ 5 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌లో హీరో హౌస్, హీరోయిన్ హౌస్‌కి సంబంధించిన సన్నివేశాలను, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ని, ఓ ఐటెం సాంగ్‌ని చిత్రీకరిస్తాం. రాణా, జెనీలియాతో పాటు ఆలీ, విజయ్, చిత్రం శ్రీను తదితరులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు' అని నిర్మాత కిరీటి చెప్పారు. ఫీల్‌గుడ్ యూత్‌ఫుల్ మూవీగా రూపొందుతున్న 'నా ఇష్టం' రాణా కెరీర్‌లో ఓ చక్కని చిత్రంగా నిలుస్తుందని దర్శకుడు ప్రకాష్ చెప్పారు.
బ్రహ్మానందం, హర్షవర్ధన్, నాజర్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, ఆలీ, అజయ్, భరత్, ఉత్తేజ్, శ్రీనివాసరెడ్డి, విజయ్‌సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, పృథ్వీ, జోగి బ్రదర్స్ నటిస్తున్న ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, రచనా సహకారం: చంద్రశేఖర్, టి.రమేష్, వేమారెడ్డి, శ్రీకర్, సంగీతం: చక్రి, ఫొటోగ్రఫీ: వెంకటప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: జి.గోపాలకృష్ణ, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాష్ తోలేటి.


Click it and Unblock the Notifications











